TSRTC: మహాలక్ష్మీ పథకం ద్వారా 15 కోట్ల మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు. ఈ సందర్బంగా పీవీ మార్గ్ లో కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు 15 కోట్ల మంది ప్రయాణించడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ సంబురాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది.
మహాలక్ష్మీ పథకం మొదలైన 11 రోజుల్లోనే లక్షల మంది ఉచిత ప్రయాణం చేశారు. పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల బస్సులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి.
Read also: Elon Musk Phone: ఫోన్ స్విచ్ ఆఫ్ చేయనున్న ఎలాన్ మస్క్.. కాల్స్, మెసేజ్ ఎలా చేస్తాడంటే ?
త్వరలో 2 వేల బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఇందులో 1000 డీజిల్, 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ఎండీ సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి లాభాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలల వ్యవధిలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఛార్జీల కింద రూ.535.52 కోట్లు ఆదా చేశారని సజ్జనార్ వివరించారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ బస్సులో 90 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీ రేటు నమోదు కావడం గమనార్హం.
US Presidential Election 2024: మరో ప్రైమరీలో డోనాల్డ్ ట్రంప్ విజయం..