Old city Riots in Hyderabad: భాగ్యనగరంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పాతబస్తీని పోలీసులు పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. దీంతో మీర్‌చౌక్, చార్మినార్, గోషామహల్ పరిధిలో మొత్తం 360 మంది ఆర్పీఎఫ్ బలగాలు విధుల్లో ఉండగా.. ప్రధాన ప్రాంతాలైన చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, శాలిబండతో పాటు మోగల్పురా, తలాబ్ కట్టా, రీన్‌బజార్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు నిన్న రాత్రి 8 గంటలలోపే మూసివేయించారు. అక్కడ రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వాహనదారులు, పాదచారులను ఇళ్లకు పంపించేశారు. వీధుల్లో.. గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించి, అదనపు సీపీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అయితే.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిన్న రోజున, శాలిబండ, సైదాబాద్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు యువకులను అదుపులోతీసుకున్నారు. అయితే.. అరెస్ట్ చేసిన యువకులను విడుదల చేయాలని పోలీసులను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరడంతో.. పరిస్థితి సద్దుమణిగాక అర్ధరాత్రి 3 గంటల వేళ 127 మంది యువకులను కంచన్‌బాగ్ పోలీసులు విడుదల చేశారు. ఈనేథ్యంలో.. తెల్లవారుజామున శాలిబండకు వచ్చిన సీపీ సీవీ ఆనంద్, అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రాంతంలో.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకోవాలని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Welfare Schemes : సంక్షేమ పథకాలు శృతిమించాయా..? ఉచితాలు ఏమిటనే దానిపై గందరగోళం..!