10th answer sheets Missing: ఆదిలాబాద్‌లో పదోతరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10th answer sheets Missing: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది. పోస్టు ఆఫీస్ నుంచి బస్టాండ్ కు తరలిస్తుండగా ఒక్క కట్ట జవాబు పత్రాలు మిస్ అయినట్లు తెలిపారు. ఆటోలో తరలిస్తుండగా మిస్ అయినట్టుగా పోస్ట్ మాస్టర్ హరీష్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లను అధికారులకు ఫిర్యాదు చేశారు. మాయమైన జవాబు పత్రాల కట్టలో సుమారు 30 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎవరు జవాబు పత్రాలను కొట్టేశారు. ఆటోలో తరలిస్తున్నప్పుడే మిస్ అయ్యాయా? లేక ఆటో ఎక్కడైన ఆపడం వలన ఎవరైనా పేపర్ల కట్టను దొంగలించారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, తనతో పాటు ఆటోలో వెళ్లిన వారిని, పాఠశాలనుంచి ఆన్సర్ సీట్ పేపర్ల కట్టను ఎవరు ఆటోలో పెట్టారో వారిని విచారించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేయగా.. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. కాసేపటికే 9.37 గంటలకు బందెప్ప మరో ఉద్యోగి సమ్మప్పకు వాట్సాప్ పంపించారని వెల్లడించారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందన్నారు. నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని.. నేటి నుంచి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.
Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..