ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన ఆయన.. దసరా సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభాకాక్షంలు చెబుతూనే.. కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో గుడ్‌న్యూస్ కూడా చెప్పారు.
ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్.. ముందుగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మీరు కరోనా సమయంలో కానీ మరియు ఇతర సమయంలో చాలా నిబద్ధతతో పనిచేసి ఎంతో మంది ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు, చాలా మంది ప్రాణాలు కూడా మీరు రక్షించ గలిగారని ప్రశంసించారు.. ఇకమీదట మీయొక్క జీతాలు ఒకటో తారీఖునే రాబోతున్నాయి.. నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఒకటే.. ఇప్పుడు కూడా మీరు అంతే నిబద్ధత, శ్రద్ధ, బాధ్యత మరియు క్రమశిక్షణతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.. ప్రయాణికులే దేవుళ్లు… వారి ఆధారాభిమానాలే సంస్థకు నిధి వారిని సురక్షితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చటం మన విధి అన్న ఆయన.. ప్రయాణికుల మన్ననలు పొందుతూ వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా సకాలంలో చేర్చివారి అభిమానాన్ని చూరగొందాం. సంస్థను ప్రగతి బాటలో నడిపిద్దాం అంటూ ఓ ప్రకటన విడుదల చేవారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. కాగా, కరోనా కష్టకాలంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా నష్టాలపాలైన ఆర్టీసీ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టం కావడంతో.. ప్రతీ నెల 20 తేదీ తర్వాత జీతాలు ఇస్తూ వచ్చారు.. కానీ, ఆ ఇబ్బందులు చెక్ పెట్టి.. ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వనున్నారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!