తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు పర్యటనలు మరింత ఊపందుకున్నాయి. అయితే, నేడు ప్రియాంక గాంధీ తెలంగాణలోని మూడు నియోజకవర్గాలల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు నియోజక వర్గాలల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు చివర రోజున హైదరాబాద్ నడిబొడ్డులో కాంగ్రెస్ అగ్ర నేతలు భారీ జన సందోహం మధ్య రోడ్ షో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనుంది.
Read Also: KCR Tour: నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం..
ఇక, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు. ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంక గాంధీ కొడంగల్ లోని బహరంగ సభలో ప్రసంగించనున్నారు. రేపు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో.. హైదరాబాద్ నగరంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ నుంచి వచ్చిన దాదాపు ఉన్నత స్థాయి నాయకులు అందరు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెల్లడించారు.