Zebronics Pixaplay 22: ఫ్లిప్‌కార్ట్ వేదికగా జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 స్మార్ట్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ ప్రొజెక్టర్‌పై ఏకంగా 76 శాతం తగ్గింపు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మోడల్‌ను కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో చెల్లిస్తే రూ.450 అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ ఆఫర్‌తో జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌ను రూ.8,549కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Read Also: Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం.. ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి
150 అంగుళాల వరకు ప్రొజెక్షన్ సపోర్ట్
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 63.5 సెంటీమీటర్ల నుంచి 406 సెంటీమీటర్ల వరకు ప్రొజెక్షన్‌కు మద్దతు ఇస్తుంది. గరిష్టంగా 150 అంగుళాల స్క్రీన్ ప్రొజెక్షన్ చేయవచ్చు. ఇందులో 1280 x 720 పిక్సెల్స్ నేటివ్ రిజల్యూషన్, 1920 x 1080 పిక్సెల్స్ మాక్స్ రిజల్యూషన్ లభిస్తుంది. ఫుల్ హెచ్‌డీ (FHD), 1080p, 720p వీడియోలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
బ్రైట్‌నెస్, డిస్‌ప్లే ఫీచర్లు
జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్ 3400 లూమెన్స్ బ్రైట్‌నెస్తో వస్తుంది. ఇందులో LED డిస్‌ప్లే టెక్నాలజీను ఉపయోగించారు. అంతేకాకుండా, 30,000 గంటల LED ల్యాంప్ లైఫ్ ఉండటం విశేషం. ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ కావడంతో మిరాకాస్ట్, iOS స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ తో నడవనుంది. ఆండ్రాయిడ్, iOS డివైసులకు ఇది అనుకూలంగా పని చేస్తుంది. ఈ ప్రొజెక్టర్‌లో క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8GB ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. యాప్ సపోర్ట్ ఉండటంతో పాటు ఓటీటీ యాప్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
Read Also: MSVG Collections: బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్.. రెండు రోజుల్లోనే 120 కోట్లు..!
కనెక్టివిటీ, ఇతర సదుపాయాలు
జెబ్రానిక్స్ పిక్సాప్లే 22లో బ్లూటూత్ v5.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, HDMI, USB, AUX అవుట్ లాంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ కూడా అందుబాటులో ఉంది. రిమోట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఫోకస్ ఫీచర్ ఈ ప్రొజెక్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే, ఈ ప్రొజెక్టర్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. కేవలం 790 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో సులభంగా తీసుకెళ్లేలా తయారు చేశారు. ప్రొటెక్టివ్ స్లీవ్, క్యారీ లూప్ కూడా అందిస్తున్నారు. హోమ్ థియేటర్ అవసరాలకే కాకుండా సినిమాలు, టీవీ షోలు, గేమింగ్ కోసం కూడా ఈ జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌ను వినియోగించుకోవచ్చు.
బాక్స్‌లో లభించే యాక్సెసరీస్
* ప్రొజెక్టర్
* రిమోట్ కంట్రోల్
* పవర్ అడాప్టర్
* HDMI కేబుల్
* ప్రొటెక్టివ్ స్లీవ్
* క్యారీ లూప్