YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Premium Free: యూట్యూబ్ తన యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు 2 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా నెలకు రూ.149 ఖర్చయ్యే ఈ ప్లాన్‌ను ఇప్పుడు ‘జీరో కాస్ట్’తో పొందే అవకాశం కల్పిస్తోంది. దీనిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
మీరు ఈ ఆఫర్‌కు అర్హులైతే, చాలా సులభంగా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ మొబైల్‌లో YouTube యాప్ ఓపెన్ చేయండి. తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లోని ‘You’ ట్యాబ్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు ‘Get YouTube Premium’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 2 నెలల ఫ్రీ ట్రయల్ ఆఫర్ కనిపిస్తుంది. అక్కడ మీ పేమెంట్ మెథడ్ (Card/UPI) వివరాలను జోడించాల్సి ఉంటుంది. ట్రయల్ కాలంలో మీ నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. ఒకవేళ మీకు నచ్చకపోతే, 2 నెలలు పూర్తి కావడానికి ముందే ఎప్పుడైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందంటే..
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు. గూగుల్ దీనిపై స్పష్టమైన నిబంధనలు వెల్లడించనప్పటికీ, కొన్ని కీలక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ యూట్యూబ్ ప్రీమియం తీసుకోని వారికి ఈ ఆఫర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్‌కు ఈ 2 నెలల ఆఫర్ కనిపిస్తుండగా, కొందరు ఐఫోన్ యూజర్లకు మాత్రం కేవలం ఒక నెల ట్రయల్ మాత్రమే కనిపిస్తోంది.
ప్రీమియం సేవలతో కలిగే ప్రయోజనాలు ఇవే!
ఉచిత ట్రయల్ పీరియడ్‌లో మీరు కొన్ని బెనిఫిట్స్‌ను పొందుతారు. అవి ఏంటంటే.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఎటువంటి యాడ్స్ రావు, దీనివల్ల అంతరాయం లేని అనుభూతి కలుగుతుంది. యూట్యూబ్‌లో ఉన్న లక్షలాది పాటలను ఎలాంటి యాడ్స్ లేకుండా వినవచ్చు. అలాగే యాప్ క్లోజ్ చేసినా లేదా ఫోన్ లాక్ చేసినా వీడియో లేదా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. మీకు నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లేనప్పుడు కూడా చూసుకోవచ్చు. మెరుగైన 1080p వీడియో క్వాలిటీ, స్మార్ట్ డౌన్‌లోడ్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండవచ్చు. ఇప్పుడే మీ అకౌంట్‌లో ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
READ ALSO: BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్.. ఉచితంగానే ఆ సేవలు!
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!