BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్.. ఉచితంగానే ఆ సేవలు!
- ఇకపై తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే భయపడక్కర్లేదు..
- ఫోన్ వస్తే ‘అఫీషియల్’ పేరే స్క్రీన్ పైకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే మీకు వచ్చే గుర్తుతెలియని కాల్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల పేర్లను మీ మొబైల్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) సేవలను అందుబాటులోకి తెస్తోంది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తుండగా, బీఎస్‌ఎన్ఎల్ కూడా తన సన్నద్ధతను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ సొల్యూషన్ అమలు పూర్తయిందని, వివిధ జోన్లలో నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ ప్రక్రియ జరుగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో 3 నుంచి 4 నెలల్లో ఈ సేవలు వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
ట్రూ కాలర్‌కు, CNAPకు తేడా ఏంటి
చాలామంది ఇప్పటికే వాడుతున్న ట్రూ కాలర్ యాప్, డేటాను క్రౌడ్‌సోర్సింగ్ (ఇతరుల ఫోన్ బుక్స్) ద్వారా సేకరిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు పేర్లు తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ CNAP విధానం దానికి భిన్నమైనది. వినియోగదారులు సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో అందించిన అధికారిక KYC రికార్డుల నుంచే పేర్లను సేకరిస్తుంది. టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉన్న అధికారిక డేటా కాబట్టి, కాలర్ పేరు అత్యంత కచ్చితంగా ఉంటుంది. ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకపోయినా, కాల్ చేస్తున్న వ్యక్తి అసలు పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ నిర్ణయానికి కారణం ఇదే..
ఇటీవల కాలంలో దేశంలో స్పామ్ కాల్స్, ఆన్‌లైన్ స్కామ్‌లు, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి కారణంగా సామాన్యులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, కాలర్ యొక్క నిజమైన గుర్తింపును తెలియజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ CNAP సేవలను తప్పనిసరి చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
READ ALSO: Shane Warne-RR: షేన్ వార్న్ మాస్టర్ మైండ్.. రాజస్థాన్ రాయల్స్ నుంచి రూ.460 కోట్లు!
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!