Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?
- Xiaomi 17 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్
- Leica ఆప్టిక్స్‌తో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్
- 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు, 50MP ఫ్రంట్ కెమెరా
- 6.3 అంగుళాల OLED డిస్ప్లేతో పాటు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
- Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
- 6330mAh భారీ బ్యాటరీతో పాటు 100W హైపర్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- Xiaomi 17 ప్రారంభ ధర రూ.89,999.
- మార్చి 18 నుంచి అమ్మకాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17 Launched: షియోమీ (Xiaomi) భారత్‌లో Xiaomi 17 స్మార్ట్‌ఫోన్‌ను Xiaomi 17 Ultraతో కలిసి లాంచ్ చేసింది. ఈ స్టాండర్డ్ మోడల్ లో లైకా (Leica) ఆప్టిక్స్ తో పాటు షియోమీ గార్డియన్ స్ట్రక్చర్ (Xiaomi Guardian Structure) అందించారు. ఇందులో బలమైన అల్యూమినియం ఫ్రేమ్, షియోమీ షీల్డ్ గ్లాస్ 3.0, అలాగే IP68/69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Also Read
- Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
- WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
- Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
- Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
షియోమీ17లో 6.3 అంగుళాల OLED డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ మందం 8.06mm కాగా, బరువు 191 గ్రాములుగా ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 12GB LPDDR5X ర్యామ్ తో పాటు 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ను అందిస్తుంది. అలాగే ఇందులో ఈ ఫోన్లో 6330mAh బ్యాటరీ ఉంది. దీనికి 100W హైపర్ ఛార్జ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. ఇందులో HyperAI సూట్ కూడా ఉంటుంది. ఇది AI రైటింగ్, AI డైనమిక్ వాల్‌పేపర్స్, AI సెర్చ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. అలాగే ఫోన్లో షియోమీ 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టంను కూడా అందించారు. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా (1/1.31-ఇంచ్ Light Fusion 950 సెన్సార్), 50MP టెలిఫోటో కెమెరా (60mm ఫోకల్ లెంగ్త్), 50MP అల్ట్రా వైడ్ కెమెరా (102° ఫీల్డ్ ఆఫ్ వ్యూ), సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా (f/2.2 అపర్చర్, 90° ఫీల్డ్ ఆఫ్ వ్యూ) ఉంది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ (30fps)కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ (60fps వరకు) కూడా చేయవచ్చు.
200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
భారత్‌లో Xiaomi 17 ప్రారంభ ధర రూ. 89,999 (12GB + 256GB)గా ఉంది. అలాగే 12GB + 512GB వేరియంట్ ధర రూ. 99,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ “Never Run Out” లాంచ్ ఆఫర్లో భాగంగా 512GB వేరియంట్‌ను 256GB ధరకే అందిస్తోంది. వీటితోపాటు “ఎర్లీ బర్డ్” ఆఫర్లో రూ. 9,999 విలువైన ఫోన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉచితంగా అందుతుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా వినియోగదారులకు 4 నెలల స్పాటిఫ్య్ ప్రీమియం, 3 నెలల గూగుల్ AI ప్రో, 3 నెలల యూట్యూబ్ ప్రీమియం, రిలయన్స్ జియో నుంచి రూ.31,500 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఫోన్ అమెజాన్, షియోమీ అధికారిక వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో మార్చి 18 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!