స్మార్ట్ ఫోన్ లవర్స్ తరచుగా మొబైల్ ఫోన్స్ ను మార్చేస్తూ ఉంటారు. కాస్త పాతబడినా, కొంచెం డ్యామేజ్ అయినా కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటారు. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే అప్ డేటెడ్ వర్షన్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు రూ. 10 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు ఈ మధ్య న్యూ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే రూ. 10 వేల రేంజ్ లో రెడ్ మీ, రియల్ మీ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Redmi 14C 5G, Realme C63 5G రెండూ 5G కనెక్టివిటీని అందించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు. రెండు ఫోన్లలో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏ ఫోన్ బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.
Redmi 14C 5G vs Realme C63 5G:
Redmi 14C 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ తో వస్తుంది. Realme C63 5G 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీని బ్రైట్‌నెస్ 625 నిట్స్. రెండు ఫోన్‌లలోనూ HD ప్లస్ రిజల్యూషన్ అందించారు. కానీ Realme ఫోన్‌లో పిక్సెల్ సాంద్రత ఎక్కువగా ఉంది. Redmi ఫోన్ స్క్రీన్ పరిమాణం కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది కంటెంట్‌ను చూడడానికి బెటర్ గా ఉంటుంది.
Also Read:Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..
Redmi 14C 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 6GB RAM తో వస్తుంది. Realme C63 5G 6nm ప్రాసెసింగ్‌పై నిర్మించబడిన డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. Redmi 14C 5G 5160mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. Realme C63 5G ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక్కడ Redmi ఫోన్ బ్యాటరీ సామర్థ్యం ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటిలో రియల్ మీ ఫోన్ కంటే బెటర్ గా ఉంది.
Also Read:Vishwak Sen: సారీ.. నా సినిమాను చంపేయకండి !
Redmi 14C 5Gలో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.Realme C63 5G 32MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక్కడ Redmi ఫోన్ కెమెరా పరంగా మెరుగ్గా ఉంది. Redmi 14C 5G ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. Realme C63 5G ధర రూ.10,300 నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ Redmi ఫోన్ తక్కువ ధరకే సూపర్ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్ల ఫీచర్లను పోల్చి చూసిన అనంతరం రెడ్ మీ ఫోన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు.