ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఆప్షన్లను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్క్రీన్ షాట్ బ్లాకింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. గతంలో ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ని కొంతకాలం అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూశాక.. వెంటనే డిలీట్ అయిపోవడం దీని స్పెషాలిటీ. అయితే.. అది డిలీట్ అయిపోవడానికి ముందే కొంతమంది స్క్రీన్ షాట్లు తీయడం మొదలెట్టారు. ఇలా చేయడం వల్ల ‘వ్యూ వన్స్’ కాన్సెప్ట్‌కే అర్థం లేకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. ‘వ్యూ వన్స్’ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీయడానికి వీలు లేకుండా కొత్త ఫీచర్ తీసుకువస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటివరకూ iOS beta టెస్టింగ్ లో వున్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
మనకు వచ్చే ఇమేజెస్, వీడియోల నుంచి మనకు ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైంలో స్క్రీన్ షాట్లు తీయడం ఇక కుదరదన్నమాట. మెటా వర్స్ ఫౌండర్ మరియు సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ఈమధ్యే ఈ ఫీచర్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో మూడు కొత్త ప్రైవసీ ఫీచర్లు తెస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మనం మెసేజ్ చేసేటప్పుడే వాటిని స్క్రీన్ షాట్ తీయకుండా అదనపు భద్రతా ప్రమాణాలు పాటించనున్నారు. ఐవోఎస్ తర్వాత ఈ తరహా ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని మార్క్ జుకెర్ బర్గ్ తెలిపారు.
WhatsApp కొత్త ప్రెజెంటేషన్ స్క్రీన్‌పై పని చేస్తోంది, అది ఒకసారి వీక్షణ యొక్క కొత్త వెర్షన్‌ను పరిచయం చేస్తుంది: ఈ కొత్త వెర్షన్ ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. చిత్రాలు మరియు వీడియోలను వీక్షించాక వాటిస్క్రీన్‌షాట్‌లను తీయడం అసాధ్యం. మనం పంపిన చిత్రాలు మరియు వీడియోలను ఒకసారి వీక్షించడానికి స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నించినప్పుడు, స్క్రీన్‌షాట్ స్వయంచాలకంగా బ్లాక్ చేయబడుతుంది కానీ పంపినవారు ఎటువంటి నోటిఫికేషన్‌ను స్వీకరించరు. అయినప్పటికీ, సెకండరీ ఫోన్ లేదా కెమెరాను ఉపయోగించి వినియోగదారు ఇప్పటికీ ఫోటో తీయవచ్చు. కొత్త ఫీచర్లు WhatsApp వినియోగదారులకు అందరికీ తెలియజేయకుండా గ్రూప్ చాట్‌ల నుండి నిష్క్రమించడానికి, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చో నియంత్రించడానికి మరియు సందేశాలను ఒకసారి వీక్షించే స్క్రీన్‌షాట్‌లను నిరోధించడానికి అనుమతిస్తుంది. “మేము మీ సందేశాలను రక్షించడానికి మరియు వాటిని వ్యక్తిగతంగా మరియు ముఖాముఖి సంభాషణల వలె సురక్షితంగా ఉంచడానికి కొత్త మార్గాలను రూపొందిస్తూనే ఉంటాము” అని జుకర్‌బర్గ్ చెప్పారు.
Read Also: Sports and Technology: అసలు వయసును దాచే “ఆటలకు” టెక్నాలజీతో చెక్