WhatsAppలో నయా ఫీచర్ ఆగయా.. ఇకపై మీకు నచ్చిన భాషలో మెసేజ్స్
- వాట్సప్ లో కొత్త ఫీచర్
- ఇకపై మీకు నచ్చిన భాషలోనే చాట్
- "Translate" ఆప్షన్‌తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సులభంగా సంభాషించుకునేందుకు వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్, సంభాషణల (మెసేజ్స్) మధ్య ఉన్న భాషా అంతరాలను తగ్గించనుంది. చాట్‌లలో వచ్చే సందేశాలను యూజర్లు తమకు నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది.
Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్‌లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
వాట్సప్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ సంభాషణలతో పాటు ఛానల్ అప్‌డేట్స్‌లో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. మొదట ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంగ్లిష్, స్పానిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్‌లో మాత్రం ఏకంగా 19కు పైగా భాషలకు మద్దతు లభిస్తుంది.
అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. యూజర్లు ఒక సందేశాన్ని అనువదించాలనుకుంటే, ఆ సందేశంపై కాసేపు నొక్కి ఉంచాలి. అప్పుడు కనిపించే కొత్త ‘ట్రాన్స్‌లేట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత, వారు ఏ భాషలోకి అనువదించాలనుకుంటున్నారో ఆ భాషను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు కావాలనుకుంటే, మొత్తం చాట్ థ్రెడ్‌కు ఆటోమేటిక్ అనువాదాలను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సందేశాలన్నీ మాన్యువల్ గా మార్చాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా అనువాదం అవుతాయి.
విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?
ఈ అనువాద ప్రక్రియ యూజర్ డివైస్‌లోనే జరుగుతుందని వాట్సప్ స్పష్టం చేసింది. దీని వల్ల సంభాషణల గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని, వాట్సప్ కూడా ఆ సందేశాలను చదవబోదని కంపెనీ పేర్కొంది. ఈ మధ్యకాలంలో వాట్సప్‌లో AI ఆధారిత ఫీచర్‌లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా దానిలో భాగమేనని కంపెనీ తెలిపింది. ఇది ‘రైటింగ్ హెల్ప్’ వంటి AI ఆధారిత ఫీచర్ల కొనసాగింపుగా చెప్పవచ్చు. దీని వల్ల యూజర్లు తమ సందేశాలను మరింత మెరుగ్గా రాసుకోవడానికి, అలాగే వచ్చిన సందేశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని భాషలకు ఈ అనువాద సదుపాయం విస్తరించే అవకాశం లేకపోలేదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!