WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp-Group Message History: ప్రపంచ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచే దిశగా “గ్రూప్ మెసేజ్ హిస్టరీ” అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌లో కొత్తగా చేరే సభ్యులు ఇదివరకు గ్రూప్ లో జరిగిన సంభాషణలను చూసే అవకాశం పొందుతారు. దీని వల్ల వారు ఎలాంటి విషయాలపై ఎలా రియాక్ట్ అవ్వాలనేది సులభంగా అర్థం చేసుకుని, కొనసాగుతున్న సంభాషణలో ఇబ్బంది కలగకుండా పాల్గొనగలుగుతారు.
T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
Also Read
- iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మిన్లు లేదా సభ్యులు కొత్తగా చేరిన వ్యక్తికి కొత్త మెసెజ్స్ ను షేర్ చేయవచ్చు. షేర్ చేయబడిన మెసెజ్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటాయి. అంటే ప్రైవసీ పరంగా ఎలాంటి రాజీ ఉండదు. అయితే ఈ ఫీచర్ ద్వారా కొన్ని పరిధిలను ఏర్పాటు చేశారు. అవేంటంటే..
మెసేజ్ పరిధి: కొత్త సభ్యులకు కనీసం 25 నుండి గరిష్టంగా 100 వరకు కొత్త మెసెజ్స్ పంపే అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ చర్చల సారాంశాన్ని అర్థం చేసుకునేందుకు సరిపడా సమాచారాన్ని అందిస్తుంది.
అడ్మిన్ నియంత్రణ: ఈ ఫీచర్‌ను గ్రూప్ అడ్మిన్ అవసరమైతే డిసేబుల్ చేయవచ్చు. అయితే అడ్మిన్‌కు ఎప్పుడైనా మెసేజ్ హిస్టరీను షేర్ చేసే హక్కు ఉంటుంది.
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ ఘటనపై మంత్రి సత్యకుమార్ ప్రకటన..
పారదర్శకత: మెసేజ్ హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్ లోని అందరి సభ్యులకు నోటిఫికేషన్ అందుతుంది. షేర్ చేసిన సందేశాల్లో టైమ్ స్టాంప్, పంపిన వ్యక్తి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
విజువల్ ప్రత్యేకత: మెసేజ్ హిస్టరీ సాధారణ మెసేజ్ లతో కలగలిపి ఉండదు. అవి స్పష్టంగా వేరుగా చూపబడతాయి. దీనితో కొత్తగా షేర్ చేసిన చరిత్రను సులభంగా గుర్తించవచ్చు.
ఫార్వర్డ్ అవసరం లేదు: ఇకపై స్క్రీన్ షాట్ లు తీసి పంపడం లేదా ఒక్కో మెసేజ్ ను మాన్యువల్ గా ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ఆ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేస్తుంది.
తాజావార్తలు
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!