టెక్ మార్కెట్లో అధునాతన సాంకేతికతలు నిత్యం పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఫోన్ కంపెనీల ప్రధాన దృష్టి కెమెరాపైనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఫోన్‌తో ఛార్జర్ ఉంచుకోవాల్సిన అవసరం తగ్గింది. దీని వెనుక కారణం ఏమిటంటే.. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లతో ఎక్కువ వాట్ ఛార్జర్‌లు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే మొబైల్ ఛార్జర్‌ను తమతో తీసుకువెళుతున్నారు. శక్తివంతమైన బ్యాటరీతో పాటు, శక్తివంతమైన ఛార్జర్ కూడా ఫోన్‌లో అందించబడుతుంది.
READ MORE: Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..
స్మార్ట్‌ఫోన్‌లలో టైప్ సి ఛార్జర్‌తో పాటు ఎక్కువ వాట్ ఛార్జర్‌ను ఫోన్ కంపెనీలు అందిస్తున్నాయి. కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఫోన్ కెపాసిటీ తగ్గిపోతోంది. నిజానికి, చాలా మంది టైప్ సి ఛార్జర్‌ని శుభ్రం చేయరు. దీంతో ఛార్జర్ నుంచి మురికి టైప్ సి పోర్ట్‌లోకి చేరుతుంది. ఫలితంగా ఫోన్ యొక్క జీవితకాలం తగ్గిపోతుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే తక్కువ సమయంలోనే ఫోన్ పాడైపోతుంది. టైప్ సి ఛార్జర్‌ను తరచూ శుభ్రం చేస్తుండండి.
READ MORE: Madhyapradesh : నిత్య పెళ్లికూతురు.. ఆరుగురిని చేసుకుని ఏడో వాడితో పెళ్లికి రెడీ అయింది..కానీ
దీనితో పాటు.. చాలా మందికి వారి ఛార్జర్ ఎన్ని వాట్స్ అనే విషయం తెలియదు. అదే సమయంలో.. మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయగల ఛార్జర్ గరిష్ట వాట్ సామర్థ్యం గురించి కూడా అవగాహన ఉండదు. సరైన సమాచారం తెలుసుకోకపోవడం వల్ల ఎక్కువ లేదా తక్కువ సామర్థ్యం ఉన్న ఛార్జర్ అను వినియోగిస్తుంటారు. ఇంతే కాకుండా చాలా సార్లు ప్రజలు తమ ఫోన్‌లను బహిరంగ ప్రదేశాల్లో కూడా ఛార్జ్ చేస్తారు. దీని కారణంగా ఫోన్ సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ప్రస్తుతం ఫోన్ కంపెనీలు ఫాస్ట్ టెక్నాలజీతో మొబైల్ ఛార్జర్లను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటే అసలు కంపెనీకి కేటాయించిన సామర్థ్యం గల ఛార్జర్ నే వినియోగించండి. ఉదాహరణకు, ఫోన్ 44 వాట్స్, 65 వాట్స్, 120 వాట్ల సామర్థ్యం ఉంటే.. అంతే సామర్థ్యం ఉన్న కంపెనీ ఛార్జర్ తోనే ఛార్జ్ చేయండి.