NTV Telugu Site icon

Vivo Y18t: Y-సిరీస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర రూ. 9,499

Vivo Y18t

Vivo Y18t

ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. Vivo Y18t స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

ధర:
Vivo Y18T 4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో 9,499 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ప్రస్తుతం వివో ఇండియా యొక్క ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Read Also: APPSC: అలర్ట్: గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ వాయిదా

స్పెసిఫికేషన్స్:
Vivo Y18T స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS 14తో వస్తుంది. అలాగే.. 6.56 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ (720×1,612 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90 Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ పిక్సెల్ సాంద్రత 269 ppi. స్క్రీన్ గరిష్ట ప్రకాశాన్ని 840 నిట్‌ల వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఫోన్‌లో Unisoc T612 చిప్‌సెట్ ఉంది. RAM 4GB. RAMని వర్చువల్‌గా 8 GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించుకునే అవకాశం ఉంది.

Vivo Y18t ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే.. 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 62.53 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ సైజ్ 163×75.58×8.3mm. బరువు 185 గ్రాములు.

కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ బ్లూటూత్ 5.2, FM రేడియో, GPS, GLONASS, Wi-Fi, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, మోటార్ గైరోస్కోప్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఇందులో ఉన్నాయి. భద్రత కోసం ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్, IP54 రేటింగ్‌తో వస్తుంది.

Show comments