ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో బ్రాండ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. భారత మార్కెట్ లో సరికొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నది. పవర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. క్రేజీ ఫీచర్లతో వివో ఎక్స్ 200 ప్రో మినీ ఫోన్ ను భారత్ లో త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా వివో ఎక్స్200 సిరీస్‌లో ఇప్పటికే వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో భారత్‌లో రిలీజ్ అయ్యాయి. Vivo X200 Pro Mini ఏప్రిల్ లో భారత మార్కెట్ లో రిలీజ్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రీమియం ఫీచర్లు, పవర్ ఫుల్ బ్యాటరీ, కెమెరా కోసం చూస్తున్నట్లైతే Vivo X200 Pro Mini బెటర్ ఆప్షన్ గా చెప్పొచ్చు.
నివేదికల ప్రకారం.. Vivo X200 Pro Mini 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల AMOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని 1.5K AMOLED LTPO ప్యానెల్ అధిక-రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ఈ సిరీస్‌లో ఇతర మోడళ్లలాగే 9400 చిప్ ఉంటుంది. 5,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం వివో ఎక్స్200 ప్రో మినీలో ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది.
50MP ప్రైమరీ కెమెరా (Sony LYT818 సెన్సార్), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ కెమెరా (100x డిజిటల్ జూమ్), ఇది కాకుండా, ఇది 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అంచనా ధర రూ. 55,000 – రూ. 65,000 ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ చేయబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ Samsung Galaxy S24 మరియు OnePlus 12 లకు గట్టి పోటీనిస్తుంది.