ఈరోజుల్లో షోరూంలకు, సెల్ ఫోన్ షాపులకు వెళ్ళి స్మార్ట్ ఫోన్లు షాపింగ్ చేయడం దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేయడం కోసం కూడా ఆన్‌లైన్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ విధానంలో అనేక ఈ కామర్స్ కంపెనీలు మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ దగ్గర వున్న పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమయిన ఆఫర్లను అందిస్తున్నాయి.
వివో బ్రాండ్ యొక్క ఫోన్లను అతి తక్కువ ధరలకు అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో అందిస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడంతో ఇప్పుడు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. వివిధ బ్యాంకుల డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
వివో Y21e 5G స్పెసిఫికేషన్లు
* వివో Y21e 5G స్మార్ట్‌ఫోన్
* 8Gb ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999
*డ్యూయల్-సిమ్ నానో స్లాట్
* ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12
* 6.51-అంగుళాల HD+ LCD హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే
* 720×1,600 పిక్సెల్‌ల పరిమాణం
* అల్ట్రా వైలట్ డిస్ప్లే ఐ ప్రొటెక్షన్ మోడ్
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC
* 3GB RAM ఫోన్
* డ్యూయల్ కెమెరా సెటప్. f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ సెన్సార్
* f/2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
*సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/1.8 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా
వివోY15s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు
* 3GB RAM + 32GB స్టోరేజ్ ధర రూ.10,990
* మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ కలర్స్
* డ్యూయల్-సిమ్ నానో స్లాట్
* Funtouch OS 11.1తో ఆండ్రాయిడ్ 11 (Go ఎడిషన్
*6.51-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లే
* 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 SoC
* డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
* కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్
* సెల్ఫీలు, వీడియో చాట్ కోసం f/2.0 లెన్స్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కలిగి వుంది.
Motorola G22 : అరచేతిలో అద్భుతం.. మొటొరొలా జీ22..