మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO Spark 50 5G Launch: టెక్నో (TECNO) కంపెనీ భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ TECNO Spark 50 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పోటీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్, భారీ బ్యాటరీ, మంచి బిల్డ్, ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. మరి ఆ ఫీచర్లేంటో ఒక లుక్ వేద్దామా..
బ్యాటరీ:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది రోజంతా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేయబడింది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
మెమొరీ & ప్రాసెసర్:
TECNO Spark 50 5Gలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్ కు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో 4GB అండ్ 6GB RAM వేరియంట్లతో పాటు, వర్చువల్ ర్యామ్ సాయంతో మొత్తం 18GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. స్టోరేజ్ 128GB కాగా, మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. దీనివల్ల శబ్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా కాల్స్ క్లియర్‌గా వినిపిస్తాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై మొబైల్ పని చేస్తుంది.
Live in Relationship: వయోజనురాలితో వివాహితుడు సహజీవనం చేస్తే తప్పేంటి? హైకోర్టు కీలక తీర్పు
డ్యూరబిలిటీ & బిల్డ్ క్వాలిటీ:
ఈ ఫోన్ ముఖ్యమైన ప్రత్యేకత దాని రగ్గడ్ డిజైన్. ఇది MIL-STD-810H సర్టిఫికేషన్ ఉండడం వల్ల 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఫోన్‌కు పెద్దగా నష్టం కలగదు. ఇంకా IP64 PRO రేటింగ్ వల్ల నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పిస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లు:
సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ మెరుగ్గా ఉండేలా కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఇంకా UPS 3.0 టెక్నాలజీ వల్ల UPI వంటి డిజిటల్ పేమెంట్స్‌ను 2 రెట్లు వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది
అలాగే 4×4 MIMO సపోర్ట్ వల్ల డౌన్‌లోడ్ స్పీడ్స్‌ను 82% వరకు పెంచుతుంది. ఇంకా నెట్‌వర్క్ లేకుండా కమ్యూనికేషన్ పొందవచ్చు. 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డివైసులతో నెట్‌వర్క్ లేకుండా కనెక్ట్ అయ్యే సౌకర్యం ఇందులో ఉంది.
డిస్‌ప్లే & కెమెరా:
ఈ మొబైల్ కు 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే .. 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
Dhurandhar 2: దురంధర్ 2 ఊచకోత.. ఇండియాలోనే మొదటి సినిమాగా కొత్త రికార్డ్
ధర:
TECNO Spark 50 5G ధరలు ఇలా ఉన్నాయి:
* 4GB + 128GB: రూ. 16,999
* 6GB + 128GB: రూ. 18,999
ఈ ఫోన్ ఫాంటసీ పర్పల్, మింట్ గ్రీన్, ఇన్క్ బ్లాక్, ఛాంపైన్ గోల్డ్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ సహా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!