Tecno Pova Curve 5G: టెక్నో (Tecno) గత సంవత్సరం భారత మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వాటిలో సన్నని డిజైన్‌తో Tecno Pova Curve 5G ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోడల్. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 64MP కెమెరా, భారీ బ్యాటరీ, 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. హిందువుల్లో భయాందోళనలు
ధర & సేల్ వివరాలు
* టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
* 6GB RAM + 128GB స్టోరేజ్ – ₹15,999
8GB RAM + 128GB స్టోరేజ్ – ₹17,999
* 8GB RAM + 256GB స్టోరేజ్ – ₹19,999
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్..
* ఈ ఫోన్ కేవలం 7.45mm మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.
* గీక్ బ్లాక్, మ్యాజిక్ సిల్వర్, నియాన్ సియాన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
* IP64 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెంట్‌గా రూపొందించారు.
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
* ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
* 144Hz రీఫ్రెష్ రేట్
* 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్
* Wet Hand Touch ఫీచర్ వల్ల తడి చేతులతోనూ ఫోన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
మీడియా టెక్ చిప్‌సెట్ & ఆండ్రాయిడ్ 15
* టెక్నో పోవా కర్వ్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్
* వర్చువల్ RAM సపోర్ట్
* ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15.. ఈ ఫోన్‌కు భవిష్యత్తులో Android 16 అప్డేట్ తో పాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందనున్నాయి.
64MP కెమెరా సెటప్
* కెమెరా విభాగంలో ఈ ఫోన్ బలంగా నిలుస్తుంది.
* 64MP Sony IMX682 ప్రైమరీ కెమెరా
* 2MP సెకండరీ లెన్స్
* 13MP సెల్ఫీ కెమెరా.. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి. అలాగే ఆటో కాల్ ఆన్సరింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్, వాయిస్ ప్రింట్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్
* 5500mAh బ్యాటరీ
* 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు
* 5G, 4G, Wi-Fi, Bluetooth
* 5G++, VoWiFi, Intelligent Signal Hub
* NFC, IR Blaster
* Dolby Atmos సపోర్ట్‌తో స్పీకర్లు
* భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.