దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగులు జీతాలు పెంచినట్లు యాజామాన్యం వెల్లడించింది. సెప్టెంబర్ నుంచే పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 12 వేల మంది తొలగిస్తున్నామని టీసీఎస్ గతంలో ప్రకటించింది. సోమవారం నుంచి ప్రతి ఎంప్లాయ్ కి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్నామని యాజమన్యం తెలిపింది. సీ3ఏ, దాని సమానమైన గ్రేడ్ లలో అర్హులైన అసోసియేట్స్ కు వేతన సవరణ ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో టీసీఎస్ ఉన్నతాధికారులు ఇటీవల పేర్కొన్నారు.
మరో వైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,261 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని టీసీఎస్ సీఈఓ కె.కృతిహాసన్ గతంలో వెల్లడించారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ఏఐ టెక్నాలజీ మార్పుల కారణంగానే ఈ ఉద్వాసనలు చేయాల్సి వస్తున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన టీసీఎస్ లేఆఫ్ లు చేపడుతోంది. దీంతో వేరే కంపెనీలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు.