Smartphones: ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ రాకెట్ కన్నా వేగంగా పెరుగుతుంది.. జనాలు కూడా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు.. మన జీవితంలో ఫోన్ ఒక భాగమైంది.. ఎంతగా ఫోన్ కు అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేవరకు అవసరం ఉన్నా లేకున్నా కూడా చేతిలో ఉంటుంది.. ఫోన్ వచ్చిన కొత్తలో.. కేవలం మాట్లాడుకోవడం కోసమే వాడేవారు. మరి ఇప్పుడు.. బ్యాంక్ లవాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు ఫోన్‌తోనే జరిగిపోతున్నాయి. అయితే చాలామందికి ఫోన్ వాడకంలో కంట్రోల్లో ఉండదు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారు. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే పక్కన ఉన్నవారితో అవసరమే ఉండదు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు.. ఫోన్ ను ఇలా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఫోన్ ను చూస్తూ గంటల తరబడి అలా ఉంటే కళ్ళకు ఎఫెక్ట్ కలుగుతుంది.. అదే పనిగా డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, అలసట వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఫోన్ అతిగా వాడితే.. దృష్టి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్ అతిగా వాడితే.. నిద్రలేమి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చూస్తే మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర రావటంలో సహాయపడుతుంది.. ఫోన్ ను చూడటం వల్ల నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
చేతిని ఒకే కోణంలో ఉంచుతుంటారు. మోచేయి దగ్గర ఉండే అల్నార్ నరం ఒత్తిడికి గురౌతుంది. చేతికి తిమ్మిర్లు వస్తుంటాయి. మణికట్టు నుంచి మొదలు మోచేయి వరకూ నరం నొప్పి వస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఫోన్ మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం ఒకే చేతితో పట్టుకోకూడదు.. అంతేకాదు మెడ, వెన్ను నొప్పి కూడా భాదిస్తుంది.. ఫోన్లో ఎక్కువసేపు టైప్ చేయడం, స్వైప్ చేయడం, పట్టుకోవడం వల్ల మన మణికట్టు, వేళ్లు, బ్రొటనవేళ్లలో స్నాయువు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి రిపీట్ స్ట్రెయిన్ ఇంజరీస్ ఏర్పడవచ్చు.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది.. ఫోన్ ను చూస్తూ ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.. ఊబకాయం, ఇతర అనారోగ్యాల సమస్యలు ముప్పు పెరుగుతుంది.. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా రేడియెషన్ కు గురవుతారు..ఇన్ని సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఫోన్ ఎక్కువగా వాడితే అంతే.. జాగ్రత్త..
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!