Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- Poco C95 Pro
- రూ.12,700కే 7500mAh బ్యాటరీ ఫోన్
- ఫీచర్లు అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco C95 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Poco C95 Pro పేరుతో వచ్చిన ఈ ఫోన్లో భారీ 7,500mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. C సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. Poco C95 Pro రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 169 సింగపూర్ డాలర్లు కాగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.12,700గా ఉంటుంది. అదే విధంగా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 199 సింగపూర్ డాలర్లు, అంటే సుమారు రూ.15,000. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
6.9 అంగుళాల 120Hz డిస్ప్లే
Poco C95 Proలో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 × 720 పిక్సెల్స్. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 825 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రక్షణ కోసం Corning Gorilla Glass 7iను ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G91 Ultra చిప్‌సెట్‌ను అందించారు. గరిష్ఠంగా 8GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తుంది. అదనంగా RAMను వర్చువల్‌గా విస్తరించుకునే అవకాశం ఉంది. కంపెనీ ప్రకారం RAMను 16GB వరకు విస్తరించుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ Android 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
7,500mAh భారీ బ్యాటరీ
Poco C95 Proలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోదగిన ఫీచర్ 7,500mAh బ్యాటరీ. ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఇతర పరికరాలను ఛార్జ్ చేసేందుకు 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు.
50MP కెమెరా
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. Poco C95 Proలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Bluetooth 5.4, NFC, 4G, Wi-Fi వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. అయితే IP64 రేటింగ్‌ను పూర్తిగా నీటిలో ఫోన్‌ను ఉపయోగించవచ్చని అర్థం చేసుకోకూడదు.
భారత్‌లో ఎప్పుడు లాంచ్?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం Poco C95 Proను సింగపూర్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈ ఫోన్ విడుదల తేదీ, ధరపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి భారత మార్కెట్ ధరను ప్రస్తుతానికి అంచనాగా మాత్రమే చూడాలి.
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!