ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర్నెట్ ఆన్ లో ఉంటే చాలు యాడ్స్ వస్తూనే ఉంటాయి.. కొన్నిసార్లు విసుగు కూడా తెప్పిస్తాయి..
ఏదైన ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడో లేదా .. ఏ మనీ చెల్లించేటప్పుడో ఇలా యాడ్ వస్తే, మనీ చెల్లించినా, చెల్లించనట్లు చూపిస్తే… దానంతటికీ కారణం ఆ యాడే అయితే.. దాని వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. Apple iPhone లో ప్రకటనలు ఎప్పుడూ కనిపించవు.. ఇలాంటి యాడ్స్ ను ఆఫ్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఆ తర్వాత గూగుల్‌పై ట్యాప్ చేయాలి.
*. ఇప్పుడు మీరు మీ గూగుల్ అకౌంట్‌ను నిర్వహించండి అనే దానిపై క్లిక్ చేయాలి.
*. మీరు ఆ ఆప్షన్‌ను నొక్కిన వెంటనే, మీకు డేటా మరియు గోప్యత ఆప్షన్ వస్తుంది.
*. అయితే అక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు ‘వ్యక్తిగతీకరించిన ప్రకటనలు’ కనుగొంటారు. దీని దిగువన మీరు మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ అవుతున్నాయో. వాటి కారణంగానే మీకు యాడ్స్ వస్తుంటాయి.. వాటిని ఆఫ్ చెయ్యండి..
*. ఆ తర్వాత మీరు సెట్టింగ్‌ల కు వెళ్లి Googleపై నొక్కండి. ఆ తర్వాత Delete Advertising IDని ట్యాప్ చేసి డిలీట్ చేయండి. అంతే.. ఆ తర్వాత నుంచి మీ ఫోన్లో యాడ్స్ అస్సలు కనిపించవు.. ఈ ప్రాసెస్ అన్నీ ఫోన్లలో ఒకేలా ఉంటుంది.. ట్రై చేసి చూడండి..