ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. ఈ ఫోన్ లేకుండా ఎవ్వరూ ఉండలేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా మనలో చాలా మంది ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయిన లేదా వర్షానికి తడిసినా ముందుగా మీ డివైజ్ ను ఆఫ్ చేయండి. ఫోన్ లోపలికి నీరు చేరిన తర్వాత ఫోన్ ను ఆన్ లో ఉంచితే మరింత నష్టం జరగొచ్చు. అలాగే మీ ఫోన్ నీటిలో పడినప్పుడు, ఆ నీటిని బయటకి పంపేందుకు దాన్ని ఎక్కువగా షేక్ చేస్తే ఆ నీరుఫోన్ లోపలి భాగాల్లోకి చేరే ప్రమాదం కూడా ఉంది.
Also Read : Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
మరికొందరు ఫోన్ లోపల నీరు ఆరిపోవాలని హెయిర్ డ్రయ్యర్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోటు వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. మీ ఫోన్ సడెన్ గా నీళ్లలో పడితే ముందుగా పొడి బట్టతో ఫోన్ ను తుడవాలి అనంతరం చాలా సమయం వరకు ( సుమారు 12 గంటల వరకు ) స్మార్ట్ ఫోన్ ను వాడకూడదు. అలాగే కనీసం ఆరు గంటల పాటు బియ్యం బ్యాగులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది. అయితే బియ్యం గింజలు హెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్టులోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఫోన్లో ఉండే సిమ్ కార్డ్ ట్రేలను తీసేయాలి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే దాన్ని మళ్లీ ఆన్ చేయండి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా ఫోన్ లోపల కొంత తేమ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ మునుపటిలా సరిగ్గా పని చేయకపోతే.. స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్ లో చూపించాలి.
Also Read : Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం