EV Fires: డీఆర్డీవో రిపోర్ట్.. ప్రమాదాల వెనుక షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో వెల్లడించింది. బ్యాటరీ లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదికలో.. అదే ప్రధాన కారణమని తేలింది. ఎండాకాలం సీజన్‌తో ఈ ప్రమాదాలకు ఎటువంటి సంబంధం లేదని, బ్యాటరీ లోపాలు కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లను సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే ఈ వాహనాల్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశారని తేల్చింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకోవడం కోసం లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించినట్టు డీఆర్‌డీవో కుండబద్దలు కొట్టింది.
Also Read
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
- Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
ఇదిలా ఉండగా.. లావాదేవీల్ని కేంద్రం ఎలాగైతే డిజిటలైజ్ చేసిందో, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు సంభవిస్తుండడాన్ని చూస్తుంటే.. ఆ లక్ష్యానికి చేరుకుంటారో, లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. డబ్బులకి ఆశపడి లో-గ్రేడ్ మెటీరియల్‌ని వాడకుండా, ఉన్నతమైన మెటీరియల్‌తో వాహనాల్ని అందుబాటులోకి తెస్తే.. బహుశా ఆ లక్ష్యాన్ని అందుకోవచ్చు. ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!