Mumbai:ట్రాఫిక్ తగ్గించడం కోసం.. త్వరలో పాడ్ ట్యాక్సీలు ..
- ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు
- కుర్లా- బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య
- ప్రయాణికుల రవాణా కోసం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు తీసుకు వస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు.
పాడ్ ట్యాక్సీలు అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పాడ్ ట్యాక్సీ అనేది ఒక పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ యంత్రాంగంలో భాగం. ఇది డ్రైవర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. చూడడానికి అచ్చం మెట్రో లానే ఉంటుంది. కాకపోతే దీని కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాకులు ఉంటాయి. ఆ ట్రాక్ పైనే ఇవి నడుస్తాయి. ఇందులో పరిమితంగానే మనుషులు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
Also Read
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
సాధారణంగా టాక్సీలు రోడ్డు పై ప్రయాణిస్తుంటాయి. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ట్రాక్ పై ఒకే పాడ్ టాక్సీ మాత్రమే వెళుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దీంతో చాలా వేగంగా ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తాయి. ఇవి పెద్ద పెద్ద క్యాంపస్ లలో, పట్టణ కేంద్రాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో 2 నుండి ఆరు గురు ప్రయాణించవచ్చు. విద్యుత్ శక్తితో ఇవి పనిచేయడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. జీపీఎస్, సెన్సార్ల ఆధానంగా ఇవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!