Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana World Record: భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో 11 వేల పరుగులు పూర్తి చేసింది. టెస్టుల్లో 788, వన్డేల్లో 5411, టీ20ల్లో 4788 పరుగులు స్మృతి చేసింది.
శ్రీలంకతో ఫైనల్లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మంధాన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదింది. మూడో ఓవర్లో సిక్స్ కొట్టడంతో 11,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకుంది. దీంతో మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో స్మృతి హాఫ్ సెంచరీ (79) చేసింది. 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 79 రన్స్ చేసింది. స్మృతి సాగ షఫాలీ వర్మ (48), రిచా ఘోష్ (49) దూకుడుగా ఆడడంతో ఫైనల్లో భారత మహిళా జట్టు 217 పరుగుల భారీ చేసింది.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
స్మృతి మంధాన ఈ ఏడాదిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్ 2026లో మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న 10,868 అంతర్జాతీయ పరుగుల రికార్డును అధిగమించింది. దీంతో మహిళల క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. అంతేకాదు ఇటీవలే టీ20 అంతర్జాతీయ క్రికెట్లోనూ మంధాన అరుదైన రికార్డు సాధించింది. పురుషులు, మహిళల క్రికెట్‌ను కలిపి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ రికార్డును అధిగమించింది. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 37 పరుగులు చేయడంతో ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు 11 వేల మైలురాయిని అందుకుంది.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..