ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- Samsung Galaxy F70 Pro 5G భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
- 6.7-అంగుళాల FHD+ Super AMOLED Infinity-O డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
- Qualcomm Snapdragon 6 Gen 3 (4nm) ప్రాసెసర్, Adreno 710 GPU.
- 50MP OIS ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో, 12MP సెల్ఫీ కెమెరా.
- 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్లు..
- ఆఫర్లో ప్రారంభ ధర రూ.23,999 (అసలు ధర రూ.25,999)..
- ఆగస్టు 8 నుంచి Flipkart Freedom Saleలో కొనుగోలుకు అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy F70 Pro 5G: భారత మార్కెట్లో శాంసంగ్ F-సిరీస్‌లో మరో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F70 ప్రో 5G (Samsung Galaxy F70 Pro 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది.
Super AMOLED డిస్ప్లే:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ (1080 × 2340 పిక్సెల్స్) Infinity-O సూపర్ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ HBM బ్రైట్నెస్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+’ ను ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అరోరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లెదర్ ఫినిష్ను పోలిన టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానెల్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.
Also Read
- 8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
- Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
Snapdragon ప్రాసెసర్:
ఈ ఫోన్‌కు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 (4nm) (Qualcomm Snapdragon 6 Gen 3) చిప్సెట్ ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉంది. ఇది 6GB/8GB LPDDR5X RAM, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అవసరమైతే microSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ One UI 8.5పై పనిచేస్తుంది. అలాగే 6 సంవత్సరాల పాటు OS, సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.
OIS కెమెరా & బ్యాటరీ:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ తో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఇందులో 6000mAh భారీ బ్యాటరీను అమర్చారు. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఉపయోగించుకునేలా బ్యాటరీ పనితీరు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఇతర ముఖ్య ఫీచర్లు:
* IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
* సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
* స్టీరియో స్పీకర్లు
* USB Type-C పోర్ట్
* NFC సపోర్ట్
* Bluetooth 5.3
* 5G SA/NSA, Dual SIM సపోర్ట్
ధర:
ప్రత్యేక ఆఫర్లో Samsung Galaxy F70 Pro 5G మొబైల్ రూ.23,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.25,999గా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడం సేల్‌లో అమ్మకలకు అందుబాటులో ఉంటుంది.

తాజావార్తలు
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం!
-
SS Rajamouli : వారణాసి కథ, కథనం ఏంటో చెప్పిన రాజమౌళి
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!