IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI Turbo 5 Launched: షియోమీ (Xiaomi) నుండి కొత్తగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ప్రీమియం డిజైన్, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అత్యాధునిక డిస్ప్లేతో ఈ ఫోన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది కంపెనీ. ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను డిజైన్ చేసారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..
1.5K AMOLED డిస్ప్లే:
రెడ్ మీ టర్బో 5లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లేను అందించారు. ఇది 2756 x 1268 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, 3840Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. M10 ల్యూమినస్ మెటీరియల్‌తో రూపొందించిన ఈ స్క్రీన్ గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉపయోగించారు.
Also Read
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- 6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
- iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Nokia 2660 Flip 4G: రూ.4,999కే నోకియా 4G ఫ్లిప్ ఫోన్.. డ్యూయల్ డిస్ప్లే, 1450mAh బ్యాటరీతో Nokia 2660 Flip
అత్యాధునిక ప్రాసెసర్:
ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ MediaTek Dimensity 8500-Ultra ప్రాసెసర్. 4nm టెక్నాలజీపై తయారైన ఈ చిప్సెట్ 20 లక్షలకు పైగా AnTuTu స్కోర్ సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్ కలయికతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా 5300mm² VC కూలింగ్ సిస్టమ్‌తో ఉన్న 3D Ice-Loop కూలింగ్ టెక్నాలజీని కంపెనీ అందించింది. Wildboost ఆప్టిమైజేషన్ గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో వస్తోంది. ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, 6 సంవత్సరాల భద్రతా అప్డేట్లను కంపెనీ అందించనుంది.
ఫోటోగ్రఫీ:
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను అందించారు. OIS, EIS సపోర్ట్‌తో ఫోటోలు, వీడియోలు మరింత బాగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది 1080p 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

భారీ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ ఫోన్లో 7540mAh భారీ బ్యాటరీని అమర్చారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉండటంతో చాలా తక్కువ సమయంలో ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. అదనంగా 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 100W PPS ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌కు కూడా ఇది అనుకూలంగా పనిచేస్తుంది.
IP69K రేటింగ్స్:
REDMI Turbo 5 మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫోన్ వెనుక కెమెరాల చుట్టూ RGB LED లైటింగ్‌ను అందించారు. దీనిని కంపెనీ REDMI Pixel Matrixగా పిలుస్తోంది. అంతేకాకుండా IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో ఈ ఫోన్ ధూళి, నీరు, అధిక పీడన నీటి జెట్ల నుంచి రక్షణ పొందుతుంది. ఇంకా ఇందులో Wi-Fi 7, Bluetooth 6.0, NFC, NavIC, డ్యూయల్ 5G, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్, ఆడియో సపోర్ట్ అందుతుంది.
ధరలు:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే.. 8GB + 256GB వేరియంట్ రూ.37,999, 12GB + 256GB వేరియంట్ రూ.40,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19 నుంచి అమెజాన్, Mi.com, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల కింద SBI, ICICI, Axis బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్ తోపాటు.. 9 నెలల వరకు నో-కాస్ట్ EMI, 60% వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువ ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!