7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్
- రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) అధికారికంగా లాంచ్
- ప్రత్యేక ఎడిషన్ లో భాగంగా రెడ్మీ నోట్ 15 ప్రో+ సాటిలైట్ మెసేజింగ్ వెర్షన్
- 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
- 6.83-అంగుళాల మైక్రో-కర్వ్డ్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్‌ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన మిగితా స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము.
రెడ్మీ నోట్ 15 ప్రో+ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.83-అంగుళాల మైక్రో-కర్వ్డ్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణ.
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 – ఈ చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్.
ర్యామ్,స్టోరేజ్: 16GB LPDDR4X వరకు RAM, 512GB UFS2.2 స్టోరేజ్.
కెమెరా: వెనుక భాగంలో 50MP Light Fusion 800 సెన్సార్ + 50MP టెలిఫోటో + 8MP అల్ట్రావైడ్, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా.
సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్.
కనెక్టివిటీ: 5G, Wi-Fi 6, NFC, Bluetooth 5.4, GPS, గెలీలియో, గ్లోనాస్, బెయిడౌ, USB Type-C
బ్యాటరీ: 7,000mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్ + 22.5W రివర్స్ ఛార్జింగ్, Xiaomi Surge P3 ఛార్జింగ్ చిప్, Surge G1 ఫ్యూయల్ గేజ్.

రెడ్మీ నోట్ 15 ప్రో స్పెసిఫికేషన్స్:
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా.
కెమెరా: వెనుక భాగంలో 50MP Sony LYT-600 సెన్సార్ + 8MP Sony IMX355 అల్ట్రావైడ్ కెమెరా.. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 7,000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ + 22.5W రివర్స్ ఛార్జింగ్.
మిగతా స్పెసిఫికేషన్స్ ప్రో+ మోడల్ మాదిరిగానే ఉంటాయి.
ప్రత్యేక ఎడిషన్ లో భాగంగా రెడ్మీ నోట్ 15 ప్రో+ ను సాటిలైట్ మెసేజింగ్ వెర్షన్ ను లాంచ్ చేశారు. ఇందులో సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా బెయిడౌ ఆధారిత ఎమర్జెన్సీ మెసేజింగ్ సదుపాయం కల్పించారు.

Bhadrachalam Flood Update: శాంతిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 49 అడుగుల నీటిమట్టం!
ధరలు:
రెడ్మీ నోట్ 15 ప్రో+:
* 12GB + 256GB – CNY 1,899 (రూ.23,000 సుమారు)
* 12GB + 512GB – CNY 2,099 (రూ.25,000 సుమారు)
* 16GB + 512GB – CNY 2,299 (రూ.28,000 సుమారు)
* సాటిలైట్ మెసేజింగ్ ఎడిషన్ (16GB + 512GB) – CNY 2,399 (రూ.29,000 సుమారు)
రంగులు: సీడార్ వైట్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ, స్మోకీ పర్పుల్.

రెడ్మీ నోట్ 15 ప్రో:
* 8GB + 256GB – CNY 1,399 (రూ.17,000 సుమారు)
* 12GB + 256GB – CNY 1,599 (రూ.20,000 సుమారు)
* 12GB + 512GB – CNY 1,799 (రూ.22,000 సుమారు)
*రంగులు: సీడార్ వైట్, క్లౌడ్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ.
మొత్తంగా రెడ్మీ నోట్ 15 ప్రో+ ప్రీమియం ఫీచర్లతో వస్తుండగా, రెడ్మీ నోట్ 15 ప్రో కూడా మంచి బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరుతో మిడ్-రేంజ్ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

తాజావార్తలు
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
-
Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!