Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ రికార్డుల మోత మోగిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ నితీష్ తివారీకి, సౌత్ (ముఖ్యంగా మలయాళ) సినిమాతో ఉన్న ఒక క్రేజీ కనెక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఉదాహరణం సుజాత’ (2017) వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఈ ‘రామాయణ’ డైరెక్టరే! నితీష్ తివారీ, ఆయన భార్య అశ్విని అయ్యర్ తివారీ సంయుక్తంగా ఈ మలయాళ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు.
వాస్తవానికి ఈ చిత్రం బాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘నిల్ బట్టే సన్నాటా’కు అధికారిక రీమేక్. హిందీ మాతృకలో స్వర భాస్కర్, రియా శుక్లా నటించగా.. దానికి అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను నితీష్ తివారీ, అశ్విని, నీరజ్ సింగ్, ప్రంజన్ చౌదరి కలిసి రాశారు. అదే అద్భుతమైన కథను మలయాళంలో ‘ఉదాహరణం సుజాత’గా రీమేక్ చేయగా, అక్కడ కూడా మాతృక రచయితలకే క్రెడిట్స్ ఇచ్చారు. ఆ సినిమా మలయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో మంజు వారియర్ కూతురిగా బాలనటి పాత్రలో అరంగేట్రం చేసిన అనస్వర రాజన్, ఇప్పుడు మలయాళంతో పాటు సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఒకవైపు ‘రామాయణ’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంటే.. మరోవైపు డైరెక్టర్ నితీష్ తివారీకి, మలయాళ సూపర్ హిట్ సినిమాకు మధ్య ఉన్న ఈ రైటింగ్ కనెక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
-
Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!