200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- డిస్ప్లే: 6.59 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్: Snapdragon 8 Elite Gen 5 V సిరీస్ 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్
- కెమెరా: 200MP + 8MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా: 32MP ఫ్రంట్ కెమెరా
- బ్యాటరీ: 8,580mAh
- IP69 రేటింగ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్,..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI K100 Pro: షావోమీ (XIOMI) సబ్-బ్రాండ్ రెడ్మీ (REDMI) నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెడ్మీ K100 ప్రో (REDMI K100 Pro)ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. 1.5K AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Elite Gen 5 V Series ప్రాసెసర్, 8,580mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ అయ్యింది.
185Hz AMOLED డిస్ప్లే:
REDMI K100 Proలో 6.59 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 2608 × 1200 పిక్సెల్స్ రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్, 4800Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 4,500 nits వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్:
పర్ఫార్మెన్స్ కోసం “స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V” సిరీస్ 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీనికి Adreno GPU ను అందించారు. ఇక ఇందులో 12GB, 16GB LPDDR5X అల్ట్రా ర్యామ్ ఆప్షన్లతో పాటు 256GB, 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. షావోమీ HyperOS 3పై ఫోన్ పనిచేస్తుంది. గేమింగ్, గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరచేందుకు షావోమీ D2 డిస్క్రీట్ గ్రాఫిక్స్ చిప్‌ను అందించింది. అలాగే Surge T1+ సిగ్నల్ బూస్టర్, 5,150mm² ఐస్-కూల్డ్ సర్క్యులేటింగ్ పంప్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

200MP ట్రిపుల్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 200MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో 1/1.56 అంగుళాల S5KHP5 సెన్సార్, f/1.68 అపెర్చర్, OIS, EIS ఉన్నాయి. దీనికి 8MP 112-డిగ్రీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 2.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా జతగా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 10cm టెలిమాక్రోను కూడా సపోర్ట్ చేస్తుంది. 8K వీడియో రికార్డింగ్‌కు ఫోన్ మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
8,580mAh బ్యాటరీ:
REDMI K100 Proలో 8,580mAh Jinshajiang బ్యాటరీని అందించారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. సర్జ్ P3 ఫాస్ట్ ఛార్జింగ్ చిప్, Surge G2 బ్యాటరీ చిప్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.
డ్యూయల్ స్పీకర్లు:
ఆడియో కోసం డ్యూయల్ 1115F సూపర్లీనియర్ సిమెట్రిక్ డ్యూయల్-డ్రైవర్ స్పీకర్లను అమర్చారు. వీటిని “బోస్” సంస్థ ట్యూన్ చేసింది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, USB టైపు-C అందించారు.
ధర:
చైనాలో REDMI K100 Pro 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లు (రూ.56,565)గా ఉంది. 16GB + 256GB మోడల్ 4,599 యువాన్లు (రూ.65,050), 12GB + 512GB వేరియంట్ 4,399 యువాన్లు (రూ.62,220), 16GB + 512GB టాప్ వేరియంట్ ధర 4,999 యువాన్లు (రూ.70,710)గా నిర్ణయించారు. ప్రస్తుతం REDMI K100 Pro చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!