బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!
- Xiaomi నుంచి కొత్త 5G ఫోన్ విడుదలకు సిద్ధం
- 'Redmi A7 Pro 5G' ఏప్రిల్ 13న భారత్‌లో లాంచ్
- భారీ 6300mAh బ్యాటరీ – సెగ్మెంట్‌లో బ్యాటరీ కింగ్
- ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో వేగవంతమైన పనితీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiomi) తన రెడ్‌మి ‘A’ సిరీస్‌లో సరికొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయండి రంగం సిద్ధం చేసింది. ”రెడ్‌మి A7 ప్రో 5G’ (REDMI A7 Pro 5G) పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో దీని 4G వెర్షన్ విడుదలవ్వగా.. ఇప్పుడు భారత్ లో పవర్ ఫుల్ 5G వెర్షన్ ను లాంచ్ చేస్తున్నారు. “కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్” (King of Power & Style) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫోన్, బడ్జెట్ సెగ్మెంట్లో అదిరిపోయే ఫీచర్లతో రాబోతుంది.
Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ. రెడ్‌మి A7 ప్రో 5Gలో 6,300mAh బ్యాటరీని అమర్చారు. ఈ విభాగంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌గా ఇది నిలవనుంది. అలాగే ఇందులో ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ సెగ్మెంట్లోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. ఇక డిస్‌ప్లే పరంగా కూడా రెడ్‌మి రాజీ పడలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత స్మూత్ రిఫ్రెష్ రేట్ కలిగిన ప్యానెల్‌ను అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో సరికొత్త “షావోమీ హైపర్ ఐలాండ్” (Xiaomi HyperIsland) ఫీచర్ ను పరిచయం చేస్తున్నారు. ఇది ఫ్రంట్ కెమెరా నాచ్ వద్ద నోటిఫికేషన్లు, లైవ్ యాక్టివిటీస్, ముఖ్యమైన సిస్టమ్ సమాచారాన్ని డైనమిక్‌గా చూపిస్తుంది. ఐఫోన్లలో ఉండే డైనమిక్ ఐలాండ్ తరహాలో ఇది వినియోగదారులకు సులభమైన యాక్సెస్‌ను అందిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 32MP డ్యూయల్ AI కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు ఈ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫోటో ప్రాసెసింగ్ కోసం “కింగ్స్ AI నైట్స్” పేరుతో ప్రత్యేక టూల్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు గూగుల్ సంబంధిత ప్రముఖ “సర్కిల్ టు సెర్చ్” (Circle to Search) ఫీచర్ ను కూడా ఇందులో చేర్చారు. దీని ద్వారా స్క్రీన్‌పై ఏదైనా కంటెంట్‌ను హైలైట్ చేయడం ద్వారా యాప్స్ మారకుండానే నేరుగా వెతకవచ్చు.
BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఫిజికల్ డ్యూరబిలిటీ (మన్నిక) విషయంలో కూడా రాజీ పడలేదు. దీని నిర్మాణాన్ని “ట్యాంక్ లాంటి బిల్డ్” గా కంపెనీ అభివర్ణించింది. అంటే రోజువారీ వాడకంలో తలెత్తే ఒత్తిడిని, పడిపోవడాన్ని ఇది తట్టుకోగలదు. ఏప్రిల్ 13న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ అమెజాన్ (Amazon.in), mi.com, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..