Realme P4 Power: ఇప్పటి వరకు ఒక లెక్కా.. ఇక నుంచి ఒక లెక్క అంటోంది రిలయల్‌మీ కంపెనీ.. వినియోగదాలను ఇబ్బందులను తీర్చడానికి ముందడుగు వేసింది. పీ-సిరీస్‌లో భాగంగా రియల్‌మీ P4 పవర్ అనే స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జనవరి 29, 2026న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు రియల్‌మీ తన సోషల్ మీడియా ప్రకటించింది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక పేజీ షో అవుతోంది. వేల సంఖ్యలో వినియోగదారులు ఈ ఫోన్ కోసం వేయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌కి ఎందుకింత క్రేజ్ ఉందో ఇప్పుడు తెలుసుకుంది.
READ MORE: T–Hub: టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం
రియల్‌మీ P4 పవర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బ్యాటరీ. ఈ ఫోన్‌లో ఏకంగా 10,001 mah బ్యాటరీ అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసి సాధారణంగా వినియోగిస్తే కనీసం ఒకటిన్నర రోజు వరకు పనిచేస్తుందని రియల్‌మీ చెబుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్టాండ్‌బై మోడ్‌లో ఈ ఫోన్ 31 రోజులకు పైగా బ్యాటరీ నిలుస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ కేవలం 3 శాతం ఉన్నా.. దాదాపు రెండు గంటల వరకూ ఫోన్ ఉపయోగించవచ్చట. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి లేదా బ్యాటరీ గురించి టెన్షన్ పడే వారికి ఇది మంచి వార్తే. డిజైన్ విషయంలోనూ రియల్‌మీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ ఫోన్ రూపకల్పన కోసం పర్ల్ అకాడమీతో కలిసి పనిచేసింది. అందుకే ఈ డివైస్ లుక్ స్టైలిష్‌గా, కొత్తగా ఉండనుంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ, ట్రాన్స్ సిల్వర్.
READ MORE: US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
ఫోన్ లోపలి హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కంపెనీ ఇవ్వనుంది. 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది. అలాగే హైపర్‌విజన్ చిప్, ఏఐ ఆధారిత మరో చిప్ సైతం ఈ ఫోన్‌లో ఉంటాయని రియల్‌మీ చెప్పింది. అయితే అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఫోటోగ్రఫీ కోసం రియల్‌మీ P4 పవర్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మేయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో రావచ్చు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సైతం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వవచ్చని తెలుస్తోంది.
READ MORE: US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
సాఫ్ట్‌వేర్ విషయంలోనూ కంపెనీ కాంప్రమైజ్ కాలేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో పాటు రియల్‌మీ యూఐ 7.0పై పనిచేస్తుంది. వినియోగదారులకు దీర్ఘకాలం అప్‌డేట్లు అందేలా రియల్‌మీ హామీ ఇచ్చింది. ఈ డివైస్‌కు మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. డిస్‌ప్లే ఈ ఫోన్‌లో మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ టాచ్ అనుభవం లభించనుంది. అలాగే ధూళి, నీటికి తట్టుకునేలా ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ అందించవచ్చని సమాచారం. ధర విషయానికి వస్తే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.37,999గా ఉండొచ్చని అంచనా. అయితే బేస్ వేరియంట్ మాత్రం రూ.30,000 లోపే ఉంటుందని భావిస్తున్నారు. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆధునిక ఫీచర్లతో రియల్‌మీ P4 పవర్ మార్కెట్‌లో మంచి పోటీ ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి.