Quadric IT: ‘స్మార్ట్ ఏఐ కేన్’తో అంధుల కళ్లల్లో వెలుగులు నింపిన క్వాడ్రిక్!
- బయో ఏషియా వేదికపై 'రీనోట్ ఏఐ'తో క్వాడ్రిక్ ఐటీ అరంగేట్రం
- 2026లో మరింత విస్తృత లక్ష్యంతో వచ్చిన క్వాడ్రిక్ ఐటీ
- సామాజిక ప్రభావం చూపే దిశగా సంస్థ అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది బయో ఏషియా వేదికపై ‘రీనోట్ ఏఐ’తో అరంగేట్రం చేసిన ‘క్వాడ్రిక్ ఐటీ’.. 2026లో మరింత విస్తృత లక్ష్యంతో తిరిగి వచ్చింది. క్వాడ్రిక్ ఐటీ తన తాజా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దృష్టి లోపం ఉన్న వారి కోసం రూపొందించిన ‘స్మార్ట్ ఏఐ కేన్’ ప్రవేశపెట్టింది. ఇది కేవలం సాంకేతికతను ప్రదర్శించడమే కాకుండా.. సామాజిక ప్రభావం చూపే దిశగా సంస్థ అడుగులు వేస్తోందనడానికి నిదర్శనం.
ఓ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆలోచన నుంచి ఈ స్మార్ట్ కేన్ రూపుదిద్దుకుకుంది. సెన్సార్లు, కంప్యూటర్ విజన్ సాయంతో అడ్డంకులను గుర్తించి.. వినియోగదారునికి ఆడియో అండ్ వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు అందిస్తుంది. తక్కువ ధరలో లభించే ఈ పరికరం.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారికి సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తుంది. సామాజిక ప్రయోజనంతో పాటు వైద్య, ఫార్మా రంగాల్లోని నిపుణుల సమస్యలను పరిష్కరించే దిశగా కూడా క్వాడ్రిక్ ఐటీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సంస్థ మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఆవిష్కరించింది. సాధారణ ఏఐ మాదిరి కాకుండా.. ఇది వైద్య పరిభాష, క్లినికల్ డాక్యుమెంట్లు, శాస్త్రీయ సాహిత్యాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేకంగా శిక్షణ పొందింది. మెడికల్ అఫైర్స్, రెగ్యులేటరీ మరియు పరిశోధన బృందాలు పత్రాల సంగ్రహణ, సమాచార అన్వేషణ వంటి పునరావృత పనులను త్వరగా పూర్తి చేసి.. మరింత క్లిష్టమైన క్లినికల్ పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.
Also Read
- Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
- iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
- HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
- Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
వ్యాపార కార్యకలాపాల్లోని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు క్వాడ్రిక్ ఐటీ క్లోఫాస్ట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫారమ్. ఈఆర్పీ వ్యవస్థల్లోని డేటా వ్యత్యాసాలు, సయోధ్య సమస్యలను గుర్తించి.. వాటి మూల కారణాలను విశ్లేషించి, ఆదాయ నష్టాన్ని నివారించేందుకు ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ బృందాలకు సహాయపడుతుంది. గత ఏడాది ప్రారంభించిన రీనోట్ ఏఐ ఇప్పుడు స్మార్ట్ సింక్ పెన్‌గా రూపాంతరం చెందింది. ఇది ఫ్యాక్టరీలు, ల్యాబ్ అండ్ ఫీల్డ్ నుంచి చేతితో రాసిన గమనికలను నేరుగా డిజిటల్ వ్యవస్థల్లోకి అప్‌లోడ్ చేస్తుంది. తద్వారా కాగితం ఆధారిత ప్రక్రియల నుంచి డిజిటల్ ప్రక్రియలకు మారేందుకు సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
ఇవే కాకుండా లైఫ్ సైన్సెస్ రంగంలో ఈవెంట్ల నిర్వహణను సులభతరం చేసే కాన్ఫరెన్స్ యాప్, ఇన్నోవేషన్ కార్యక్రమాలకు తోడ్పడే Hack2Build, టెండర్, ఆర్డర్ వర్క్‌ఫ్లోల కోసం Tendorix వంటి పలు ప్లాట్‌ఫారమ్‌లను కూడా క్వాడ్రిక్ ఐటీ బయో ఏషియా వేదికపై ప్రదర్శించింది. 2025లో ఒకే ఉత్పత్తితో ప్రారంభమైన ప్రస్థానం 2026 నాటికి పలు వైవిధ్యమైన, సమాజానికి ఉపయోగపడే ఏఐ పరిష్కారాలతో విస్తరించింది. కేవలం ఏఐ సాధనాలను నిర్మించడమే కాకుండా.. జీవితాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని క్వాడ్రిక్ ఐటీ అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!