OPPO Reno 15 Series: ఒప్పో (OPPO) సంస్థ తన Reno 14 సిరీస్ విజయవంతం అయిన తర్వాత.. ఇప్పుడు ఆ సిరీస్ లోని అప్డేట్ వెర్షన్‌గా Reno 15 సిరీస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాట్ AMOLED స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండనున్నాయి. OPPO Reno 15 మోడల్ స్టార్‌లైట్ బో (Starlight Bow), అరోరా బ్లూ (Aurora Blue), మరియు కానెలే బ్రౌన్ (Canelé Brown) అనే మూడు రంగులలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB, 16GB+1TB వంటి వివిధ వేరియంట్లలో లభించనుంది. ఈ ఫోన్ 6.32-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండనుంది.
ఇక ప్రీమియం మోడల్ అయిన Reno 15 Pro విషయానికి వస్తే.. ఇది స్టార్‌లైట్ బో, హనీ గోల్డ్ (Honey Gold), కానెలే బ్రౌన్ రంగులలో లభిస్తుంది. Reno 15 Pro 12GB+256GB, 12GB+512GB, 16GB+512GB, 16GB+1TB వేరియంట్లలో లభించనుంది. ఈ ప్రో మోడల్ 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, గ్లాస్ బ్యాక్ (గ్లాస్ వెనుక భాగం) కలిగి ఉండనుంది. అలాగే ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
Abhinay: తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం
ఈ రెండు ఫోన్‌లు Dimensity 8450 ప్రాసెసర్‌తో రానున్నట్లు సమాచారం. కెమెరా విభాగంలో ఈ సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఇందులో 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ వంటి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లు IP68, IP69 డస్ట్ అండ్ వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌లను కలిగి ఉండడం మరో విశేషం. అధికారిక టీజర్ ప్రకారం OPPO Reno 15 సిరీస్‌లో Reno 15c అనే మరో మోడల్ కూడా ఉంది. ఈ మోడల్ 50MP రియర్ కెమెరాను, అలాగే ఇది “హై-పిక్సెల్” మోడ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.