చైనాకు చెందిన చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి లీక్‌లు, నివేదికల ప్రకారం.. ఈ సిరీస్ 2026 జనవరి 8న భారత మార్కెట్‌లోకి రావచ్చు. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. జనవరి 2026లో లాంచ్ కానుంది. ఒప్పో రెనో 15 సిరీస్‌లో మూడు మోడళ్లు రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 ప్రో మినీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రెనో 15 సిరీస్‌లో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బాడీలు.. IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉంటాయని ఒప్పో కంపెనీ చెబుతోంది. నీరు, ధూళి నుంచి ఇది రక్షణను అందిస్తుంది. భారతదేశంలో ధర విషయానికొస్తే.. ఒప్పో రెనో 15 సిరీస్ రూ.50,000 కంటే తక్కువగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెనో 15 ప్రో మినీ రూ.40,000 కంటే తక్కువ ధర పరిధిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. రెనో 15 ప్రో దాని మునుపటి ఫోన్ కంటే ఖరీదైనదిగా ఉండవచ్చని, ఇది ప్రీమియం లేదా ఫ్లాగ్‌షిప్ విభాగంలోకి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read: Temba Bavuma: ఆ ఇద్దరు టీమిండియా స్టార్స్ క్షమాపణలు చెప్పారు!
ఒప్పో రెనో 15 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉండనుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,200mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు. రెనో 15లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్.. 6,500mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఈ సిరీస్‌లో డిస్‌ప్లే ఫీచర్లు కూడా హైలైట్‌గా ఉండనున్నాయి. ఒప్పో రెనో 15 ప్రో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రో మినీ వేరియంట్ 6.32-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. అయితే స్టాండర్డ్ మోడల్ 6.59-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని మోడళ్లలో ఫుల్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, ప్రో వేరియంట్‌లలో 3,600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ ఉండనుంది. ఒప్పో రెనో 15 సిరీస్ డిజైన్, మన్నిక, పనితీరు పరంగా సూపర్ అప్‌గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. లాంచ్ సమీపిస్తున్న కొద్దీ కంపెనీ నుంచి మరిన్ని డీటెయిల్స్ వెలువడే అవకాశం ఉంది.