8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- ఒప్పో K15 సిరీస్..
- K15S, K15X రెండు కొత్త స్మార్ట్ఫోన్లను చైనాలో లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo K15s, K15x Launched: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ చైనాలో ఒప్పో (Oppo) K15 సిరీస్‌లో భాగంగా Oppo K15s, Oppo K15x పేర్లతో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మెరుగైన డ్యూరబిలిటీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్లను రూపొందించారు. K15 సిరీస్‌లో ఏప్రిల్‌లో K15 Pro, K15 Pro+ మోడళ్లు, జూలైలో స్టాండర్డ్ K15 మోడల్ విడుదలయ్యాయి.
Oppo K15s
ఈ మొబైల్ 6GB + 128GB వేరియంట్ ధర చైనాలో CNY 1,699 (సుమారు రూ.24,300)గా ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.28,600). ఈ ఫోన్ షాడో గ్రే, విండ్ ట్రయిల్ పర్పల్ రంగుల్లో లభిస్తుంది. Oppo K15sలో 6.57 అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2,372×1,080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,400 నిట్స్ బ్రైట్నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 6360 MAX చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 6GB LPDDR4X RAM, గరిష్ఠంగా 256GB UFS 2.2 స్టోరేజ్ జత చేశారు.
Also Read
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ఫొటోగ్రఫీ కోసం Oppo K15s వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది f/1.9 అపెర్చర్, ఆటోఫోకస్‌తో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. వెనుక కెమెరాతో 1080p వీడియోను 60fps వరకు రికార్డ్ చేయవచ్చు. 1080p, 720p రిజల్యూషన్లలో స్టెబిలైజ్డ్ వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ 8,000mAh బ్యాటరీ. దీనికి 45W SuperVOOC Flash Charging సపోర్ట్ ఉంది.
Oppo K15sలో Wi-Fi 5, Bluetooth, డ్యూయల్ సిమ్, BeiDou, GPS, GLONASS, Galileo, QZSS, USB Type-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ కూడా అందించారు.
Oppo K15x
ఈ మోడల్ మొబైల్ 6GB + 128GB వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ.20,000)గా నిర్ణయించారు. 6GB + 256GB మోడల్ ధర CNY 1,699 (సుమారు రూ.24,300). గ్లేసియర్ వైట్, ప్రిజం పర్పల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. Oppo K15xలో కొంచెం పెద్ద 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 1,570×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. గరిష్ఠ గ్లోబల్ బ్రైట్నెస్ 1,125 నిట్స్ వరకు ఉంటుంది.
ఈ ఫోన్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 6GB LPDDR4X RAM, గరిష్ఠంగా 256GB UFS 2.2 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది f/2.2 అపెర్చర్, ఆటోఫోకస్‌తో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. వెనుక కెమెరాతో 1080p వీడియోను 60fps వరకు రికార్డ్ చేయవచ్చు. 720p రిజల్యూషన్‌లో 120fps స్లో-మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే 6,500mAh బ్యాటరీను అందించారు. దీనికి 45W SuperVOOC Flash Charging సపోర్ట్ ఉంది. Oppo K15xలో USB Type-C పోర్ట్‌తో పాటు Wi-Fi 5, Bluetooth, డ్యూయల్ సిమ్, BeiDou, GPS, GLONASS, Galileo, QZSS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. K15sకు భిన్నంగా ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కొనసాగించారు. అలాగే సైడ్‌లో కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫోన్ కొలతలు 166.61×78.51×8.61mm కాగా, బరువు సుమారు 212 గ్రాములు.
ప్రస్తుతం Oppo K15s, Oppo K15x చైనా మార్కెట్లో మాత్రమే ప్రకటించబడ్డాయి. భారత మార్కెట్లో వీటి విడుదలపై కంపెనీ ఇంకా అధికారిక వివరాలను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!