డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X10: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించేలా ఒప్పో (OPPO) నుండి రాబోయే ఫ్లాగ్షిప్ Find X10 సిరీస్ గురించి ఆసక్తికరమైన లీకులు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదిక మొదటిసారిగా బయటకు వచ్చిన ప్రోటోటైప్ ఫొటోలు, మరికొన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒప్పో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా Apple iPhone 17 Pro తరహాలో వెడల్పాటి కెమెరా మాడ్యూల్తో పాటు 200MP కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను పరీక్షిస్తున్నట్లు లీక్ రిపోర్టులు సూచిస్తున్నాయి.
అయితే ఒప్పో నేరుగా ఆపిల్ డిజైన్‌ను కాపీ చేసిందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. కంపెనీ వివిధ ప్రోటోటైప్లను పరీక్షిస్తున్న దశలో ఉండవచ్చని లీక్ సమాచారం సూచిస్తోంది. అలాగే ఈ మూడు డివైస్‌లు Find X10, Find X10 Pro, Find X10 Pro Max మోడళ్లా.? లేక ఒకే మోడల్‌కు చెందిన వేర్వేరు వెర్షన్‌లా.? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
వెడల్పాటి కెమెరా బార్ కాన్సెప్ట్‌ను మొదటగా 2021లో గూగుల్ తన Pixel 6, Pixel 6 Pro స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టింది. పెద్ద కెమెరా సెన్సర్లకు ఎక్కువ స్థలం అవసరం కావడంతో ఈ డిజైన్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ అప్పట్లో వెల్లడించింది. తర్వాత 2025లో Apple iPhone 17 Proలో మరింత వెడల్పాటి “ప్లాటో” డిజైన్‌ను ఉపయోగించింది. ఇప్పుడు ఒప్పో కూడా ఇదే తరహా కెమెరా లేఅవుట్‌ను పరీక్షిస్తున్నట్లు లీక్ ఫొటోలు సూచిస్తున్నాయి. అయితే పెద్ద కెమెరా సెన్సర్లు, పెరిస్కోప్ లెన్స్‌లు, బ్యాటరీ వంటి భాగాలకు అంతర్గతంగా ఎక్కువ స్థలం కల్పించడమే ఈ డిజైన్ వెనుక ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
లీక్ రిపోర్టుల ప్రకారం Find X10 Proలో రెండు 200MP కెమెరాలు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన కెమెరాగా Samsung ISOCELL HPC 200MP సెన్సర్‌తో పాటు మరో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను పరీక్షిస్తున్నట్లు సమాచారం. అదనంగా 3MP మల్టీస్పెక్ట్రల్ సెన్సర్‌ను కూడా కలిగి ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.
Find X10 మోడల్లో 6.59 అంగుళాల 1.5K డిస్ప్లే, 64MP లేదా 200MP టెలిఫోటో కెమెరా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఇక Find X10 Pro Max విషయంలో మాత్రం పలు భిన్నమైన లీకులు వెలువడ్డాయి. కొన్ని నివేదికలు మూడు 200MP కెమెరాలు ఉంటాయని పేర్కొనగా.. మరికొన్ని రెండు 200MP కెమెరాలు, ఒక 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చని చెబుతున్నాయి. దీంతో Pro Max స్పెసిఫికేషన్లపై ఇంకా స్పష్టత లేదు.
లీక్ రిపోర్టుల ప్రకారం.. Find X10 సిరీస్‌లో MediaTek ప్రకటించని Dimensity 9600 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే Find X10, Find X10 Pro మోడళ్లలో సుమారు 8,000mAh బ్యాటరీ ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాగే మొబైల్ లో IP68, IP69 రేటింగ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, LTPO డిస్ప్లే వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం. అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారించబడలేదు.
ప్రస్తుతం వెలువడుతున్న లీక్‌ల ప్రకారం OPPO Find X10 సిరీస్‌ను 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్‌లో కూడా ఈ సిరీస్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ.. ధరలు, వేరియంట్లు, లభ్యతపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!