OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ సంస్థ 2026లో చైనాలో తన తొలి స్మార్ట్‌ఫోన్లు అయినా OnePlus Turbo 6, Turbo 6V మోడల్స్ ను విడుదల చేసేందుకు ఇటీవలే ప్రకటించింది. అయితే, ఇప్పుడు మరో మిస్టరీ వన్‌ప్లస్ ఫోన్ కూడా అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ ఒక పర్‌ఫార్మెన్స్- ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫోన్‌లో MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ఉండనున్నట్లు సమాచారం. ఇది మీడియాటెక్ నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా చెప్పబడుతోంది. ఫోన్ పని తీరు మరింత మెరుగ్గా ఉండేలా అధునాతన కూలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో జత చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఫోన్ OnePlus Ace 6 Ultra అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది గేమింగ్, హై- పర్‌ఫార్మెన్స్ యూజర్లను టార్గెట్ చేసే మోడల్ గా ఉండొచ్చని భావిస్తున్నారు.
Read Also: Suzuki: హిస్టరీ క్రియేట్ చేసిన సుజుకి.. 20 ఏళ్లలో 10 మిలియన్ల బైకులు తయారీ.. కస్టమర్లకు బంపరాఫర్స్
డిస్‌ప్లే & డిజైన్ వివరాలు
* 6.78 అంగుళాల 1.5K LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే
* 165Hz రిఫ్రెష్ రేట్ (OnePlus 15, Turbo 6, 6V మాదిరిగానే)
* డిజైన్‌లో పెద్ద, రౌండెడ్ కార్నర్స్, అందమైన కర్వ్ లుక్
* అల్ట్రాసోనిక్ ఇన్–డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
బ్యాటరీ రికార్డ్ స్థాయిలో ఉండనుందా?
ప్రస్తుతం ఈ ఫోన్ ప్రోటోటైప్‌లో 8,000mAh–క్లాస్ బ్యాటరీతో పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ కంపెనీ అంతర్గత అంచనాల ప్రకారం.. ఇది 9,000mAh బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం.
Read Also: Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్ ఎందుకు అమ్మాయిగా మారాడు? మొత్తం బయట పెట్టిన వర్షిణి
గేమింగ్ ఫోన్‌గా మార్చే కీలక ఫీచర్లు
* యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్
* కస్టమ్ పర్‌ఫార్మెన్స్ ట్యూనింగ్
* కొత్త హై–ఎండ్ కూలింగ్ సిస్టమ్.. ఈ ఫీచర్లు ఫోన్ వేడెక్కకుండా, గేమింగ్ సమయంలో స్థిరమైన పని తీరు అందించడంలో సహాయపడతాయి.
OnePlus Turbo 6 & 6V ఫోన్ల వివరాలు
* ప్రాసెసర్
* OnePlus Turbo 6 → Snapdragon 8s Gen 4
* OnePlus Turbo 6V → Snapdragon 7s Gen 4
డిస్‌ప్లే
* 6.78″ Flexible AMOLED
*Full-HD+ (1272×2772 పిక్సెల్స్)
* 450ppi పిక్సెల్ డెన్సిటీ
* 165Hz రిఫ్రెష్ రేట్
కెమెరా
* 50MP ప్రధాన వైడ్–యాంగిల్ కెమెరా
* 2MP మోనోక్రోమ్ లెన్స్
* 16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
OnePlus Ace 6 Extreme Edition🚨
6.78" 1.5K 165Hz LTPS Straight SC
Dimensity 9500
8000 – 9000 🔋
Built-in Cooling Fan
3D Ultrasonic Fingerprint
Fengchi Game Core / Wi-Fi Chip / Lingxi Touch Core / Flagship-level Gyroscope#OnePlus #OnePlusAce6 #OnePlusAce6ExtremeEdition pic.twitter.com/6osmSwUwq9— Ayan Ghosh (@ayansonunigam) January 9, 2026