‘ఫ్లాగ్షిప్ కిల్లర్’ ఆగయా.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 7300mAh గ్లేసియర్ బ్యాటరీతో OnePlus 15 లాంచ్.. ధర ఎంతంటే?
- వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్
- 6.78 అంగుళాల 1.5K AMOLED LTPO డిస్ప్లే తో, 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్.
- Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్, కొత్త Glacier Cooling System తో వేడి తగ్గింపు
- ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ — మెయిన్, అల్ట్రా వైడ్, 3.5x పెరిస్కోప్ లెన్స్‌లు.
- 7300mAh Glacier Battery, 120W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
- IP66/68/69/69K రేటింగ్స్ తో నీరు, ధూళి నిరోధకత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
డిస్ప్లే:
ఈ కొత్త OnePlus 15లో 6.78 అంగుళాల 1.5K AMOLED LTPO డిస్ప్లే ఉంది. దీని 1.15mm సన్నని బెజెల్స్ ఫోన్‌కి అద్భుత లుక్‌ని ఇస్తాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూడో తరం ఓరియెంటల్ స్క్రీన్ టెక్నాలజీని ఇందులో వాడారు. 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ డిస్ప్లే, WeChat, QQ, Xiaohongshu, Weibo వంటి ప్రముఖ యాప్‌ల్లో కూడా హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే DisplayMate A++ రేటింగ్, 1నిట్ డార్క్ నైట్ మోడ్ వంటి ఐ కేర్ ఫీచర్లతో కళ్లకు సౌకర్యవంతంగా పనిచేస్తుంది.
Also Read
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
7800mAh బ్యాటరీ, క్రేజీ ఫీచర్స్, IP66/68/69/69K రేటింగ్స్ తో OnePlus Ace 6 లాంచ్.!

పర్ఫార్మెన్స్:
పనితీరులో OnePlus 15 అసలు ఎక్కడ రాజీ పడలేదు. ఇది Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ మరింత చల్లగా, స్థిరంగా పనిచేస్తుంది. హ్యాండ్ టీరబుల్ స్టీల్, ఏరోస్పేస్ గ్రేడ్ సూపర్ క్రిటికల్ ఏరోజెల్ వంటి పదార్థాలను ఉపయోగించడం ద్వారా వేడి తగ్గింపులో విప్లవాత్మక ఫలితాలు సాధించింది. అలాగే G2 గేమింగ్ నెట్వర్క్ చిప్ ద్వారా నెట్వర్క్ లేటెన్సీని 65.85% వరకు తగ్గించి, ప్రొ లెవెల్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా, బ్యాటరీ:
కెమెరా విభాగంలో ఈ ఫోన్ మూడు 50MP సెన్సార్లతో మెప్పిస్తుంది. ఇందులో సోనీ 50MP మెయిన్ సెన్సార్ (OIS), 50MP అల్ట్రా వైడ్, 50MP 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లతో వస్తుంది. ఇవి 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండటం ప్రత్యేకత. అలాగే దీనికి 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయంలో 7300mAh గ్లేసియర్ బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో 6 గంటల స్ట్రీమింగ్ సమయాన్ని ఇస్తుంది. డ్యూన్, అబ్సొల్యూట్ బ్లాక్, మిస్టీ పర్పుల్ వంటి రంగుల్లో లభించే ఈ ఫోన్ IP66/68/69/69K రేటింగ్‌తో నీటి, ధూళి నిరోధకతలనూ ముందంజలో ఉంది.
ఇక ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15 చైనాలో మూడు వేరియంట్లలో లభిస్తోంది. 12GB + 256GB వేరియంట్ ధర 3999 యువాన్ (రూ.49,540), 16GB + 256GB వేరియంట్ ధర 4299 యువాన్ (రూ.53,255) ఇక టాప్ వేరియంట్ 16GB + 1TB వేరియంట్ ధర 5399 యువాన్ (రూ.66,890)గా ఉంది. ఈ ఫోన్ విక్రయాలు అక్టోబర్ 28 నుంచి చైనాలో ప్రారంభమవుతాయి. భారత మార్కెట్లో దీని లాంచ్ నవంబర్ మధ్యలో జరగనున్నట్లు వన్‌ప్లస్ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది.

తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!