OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno 16T: ఒప్పో కంపెనీ తన పాపులర్ ‘రెనో 16’ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ చైనా మార్కెట్లోకి కొత్తగా ‘ఒప్పో రెనో 16T’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రెనో 16, రెనో 16 ప్రొ మోడళ్ల సరసన ఇప్పుడు ఈ ఫోన్ చేరింది. ముఖ్యంగా మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ, అదీ కూడా చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ సైజులో ఫోన్ కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చారు. ఈ రోజుల్లో చాలామంది చిన్న స్క్రీన్ ఉన్న ఫోన్లను ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం ఒప్పో ఇందులో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించింది. స్క్రీన్ చిన్నగా ఉన్నప్పటికీ క్వాలిటీలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా 1,216 x 2,640 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఇచ్చారు. 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు 1.07 బిలియన్ కలర్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చుట్టూ బార్డర్స్ చాలా సన్నగా ఉండి 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 460ppi పిక్సెల్ డెన్సిటీతో రావడం వల్ల చూడటానికి ఫోన్ చాలా ప్రీమియమ్గా కనిపిస్తుంది.
ఈ ఫోన్‌కి మెయిన్ హైలైట్ దీని కెమెరా సెటప్ అని చెప్పాలి. వెనుక వైపు ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఇచ్చారు. దీనికి తోడుగా 116 డిగ్రీల వైడ్ యాంగిల్ కవర్ చేసే 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే, ఆటోఫోకస్ ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌తో సెకనుకు 60 ఫ్రేమ్స్ స్పీడ్‌తో 4K రిజల్యూషన్ వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలోనూ ఒప్పో తగ్గలేదు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ (3.4GHz మాక్స్ క్లాక్ స్పీడ్) వాడారు. యాప్‌లు స్మూత్‌గా రన్ అవ్వడానికి 16GB వరకు RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బేసిక్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో రాగా, టాప్ వేరియంట్ 16GB RAM + 512GB స్టోరేజ్‌తో లభిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే కలర్ఓఎస్ 16 (ColorOS 16) పై ఈ ఫోన్ రన్ అవుతుంది.
Also Read
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
సాధారణంగా పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుంది. కానీ ఈ ఫోన్లో 6,700mAh భారీ బ్యాటరీని పెట్టినా కూడా ఫోన్ మందం కేవలం 8.36 మిల్లీమీటర్లు, బరువు కేవలం 191 గ్రాములు మాత్రమే ఉండేలా డిజైన్ చేయడం విశేషం. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నీళ్లు, ధూళి నుంచి రక్షణ కోసం IP68, IP69K రేటింగ్స్ ఇచ్చారు. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. ధరల విషయానికి వస్తే, చైనాలో 12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర CNY 3,699 (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 53,000) కాగా, 16GB RAM + 512GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర CNY 4,499 (సుమారు రూ. 64,000) గా ఉంది. ఇది ప్రస్తుతం చైనాలోని ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో హార్ట్‌బీట్, గెలాక్సీ పర్పుల్, మూన్లైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ చైనా ధరలనే మన ఇండియా ధరలుగా భావించకూడదు.ఈ ఫోన్ ఇండియాలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఒప్పో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది చైనాలో మాత్రమే లాంచ్ అయింది. మనదేశంలో ఇప్పటికే విడుదలైన స్టాండర్డ్ ఒప్పో రెనో 16 మోడల్.. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6,700mAh బ్యాటరీ వంటి వేరే స్పెసిఫికేషన్లతో విక్రయించబడుతోంది.
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!