వన్ ప్లస్ ఫోన్ కి దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 Pro గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ సౌండ్ క్లారిటీ కలిగి ఉంటుంది. మార్చి 31న ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఆసక్తిగల అభిమానులు OnePlus 10 Pro లాంచ్ పేజీని లేదా OnePlus YouTube ఛానెల్‌కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలో అతి పెద్ద బ్రాండ్ గా వన్ ప్లస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారతీయులు కాస్త ఖరీదు ఎక్కువైనా వన్ ప్లస్ ఫోన్లను బాగా ఆదరిస్తుండడంతో ఆ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్లను భారత్ విపణిలోకి వదులుతోంది.
OnePlus 10 Pro స్పెసిఫికేషన్లు:
ఇప్పటికే OnePlus 10 Proని చైనాలో ఆవిష్కరించారు. ఇందులో అనేక స్పెసిఫికేషన్లు వున్నాయి.