Nothing Phone 3: నథింగ్ (Nothing) బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన నథింగ్ ఫోన్ 3 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. మొబైల్ విడుదలైన సమయంలో రూ.79,999 ధరకు విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లభిస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్లతో కలిపితే ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 12GB + 256GB బేస్ మోడల్ ధర రూ.39,999కి తగ్గింది. అలాగే, 16GB + 512GB వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. దీనికి తోడుగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్బీఐ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ తగ్గింపు ఒకవైపు వినియోగదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, మరోవైపు బ్రాండ్‌కు కొత్త విమర్శలకు దారితీస్తోంది. ఈ ఫోన్ విడుదలైన వెంటనే రూ.79,999 పెట్టి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇది ఒకరకంగా నిరాశ కలిగించే అంశం. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే దాదాపు 50% ధర తగ్గడం వల్ల, ముందుగా కొన్నవారు తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు.
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?
ఏదైనా కొత్త ఉత్పత్తిని అధిక ధర పెట్టి ప్రారంభంలో కొనుగోలు చేసేవారు ఆ బ్రాండ్‌పై, ఆ ఉత్పత్తిపై నమ్మకంతో ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్, బోనస్ యాక్సెసరీలు లేదా లాయల్టీ పాయింట్స్ అందించడం సాధారణం. కానీ, నథింగ్ సంస్థ అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రారంభ కస్టమర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంత భారీగా ధర తగ్గడం, వారి విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా.. భవిష్యత్తులో ఈ బ్రాండ్ నుంచి కొత్త ఉత్పత్తులను కొనాలా వద్దా అని ఆలోచించుకునేలా చేస్తుంది.