Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచింది. కొత్త డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 రబీ సీజన్ కోసం కనీస మద్దతు ధరల పెరిగింది. కుసుమలకు క్వింటాలుకు 600 రూపాయలు, మైసూరు పప్పుకు క్వింటాల్ కు 300 రూపాయలు, ఆవాలకు క్వింటాలుకు 250 రూపాయలు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.
READ MORE: Vladimir Putin: పుతిన్ భారత పర్యటన.. డిసెంబర్ 5-6లో వచ్చే అవకాశం..
ఈ పెంపుదల వలన డీఆర్, డీఏలు మూల వేతనంలో 55% నుంచి 58%కి పెరిగాయి. కీలక భత్యం పెంపుదల వల్ల ఖజానాపై దాదాపు రూ.10,084 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. దీపావళి పండుగకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది. వైష్ణవ్ ఇచ్చిన వివరణ ప్రకారం.. మొత్తం 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.7 మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం DA, DR లను ద్వైమాసిక సంవత్సరానికి సవరిస్తుంది. చివరిగా ఈ ఏడాది మార్చిలో సవరించారు. అప్పట్లో భత్యాన్ని 2%కు పెంచారు.
READ MORE: Teppotsavam: కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్..?