Site icon NTV Telugu

కొత్త ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

Nothing

Nothing

Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్.

డిజైన్:
ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్ డిజైన్ డిస్టర్షన్‌ను తగ్గిస్తూ, లో ఫ్రీక్వెన్సీలను మెరుగుపరుస్తుంది. టైటానియం కోటింగ్ వల్ల హై నోట్లు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ఇయర్ హుక్‌లో నికెల్ టైటానియం వైర్ వాడటం వల్ల ఇది ఫ్లెక్సిబుల్‌గా, అదే సమయంలో దృఢంగా ఉంటుంది.

ఆడియో ఫీచర్లు:
ఆటోమేటిక్ బాస్ ఎన్‌హాన్స్ అల్గారిథమ్ లో ఫ్రీక్వెన్సీలను ఆప్టిమైజ్ చేస్తూ, మంచి బాస్ అనుభవం ఇస్తుంది. అలాగే క్లియర్ వాయిస్ టెక్నాలజీ వల్ల గాలి శబ్దం ఎక్కువగా ఉన్నా లేదా పక్కా శబ్దపూరిత వాతావరణంలోనూ స్పష్టమైన కాల్స్ చేయగలుగుతారు.

Rape Case: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..

స్మార్ట్ ఫీచర్లు:
ఈ ఇయర్‌బడ్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అంతేకాకుండా, AI ఆధారిత ప్రాసెసింగ్‌తో 2.8 కోట్లకుపైగా శబ్ద పరిస్థితులపై ట్రైనింగ్ చేయబడింది. ఇయర్‌బడ్ బరువు 8.1 గ్రాములు, ఛార్జింగ్ బాక్స్ బరువు 63.8 గ్రాములు. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ (IP54) కూడా ఉంది.

బ్యాటరీ & కనెక్టివిటీ:
14.2mm డైనమిక్ డ్రైవర్ కలిగిన ఈ ఇయర్‌బడ్స్‌లో 64mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 6 గంటల టాక్‌టైమ్ ఇస్తాయి. 635mAh కేస్‌తో కలిపి 30 గంటల వరకు ప్లేబ్యాక్, 24 గంటల వరకు టాక్‌టైమ్ అందుతుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 2 గంటల మ్యూజిక్ వినిపిస్తుంది. ఇక Bluetooth 5.3 సపోర్ట్‌తో పాటు Google Fast Pair, Microsoft Swift Pair, డ్యూయల్ కనెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే, 120ms లో ల్యాగ్ మోడ్, పించ్ కంట్రోల్స్ (ప్లే/పాజ్, ట్రాక్ స్కిప్, కాల్ అన్‌సర్/రిజెక్ట్, ANC/ట్రాన్స్‌పరెన్సీ మోడ్ స్విచ్, వాల్యూమ్ కంట్రోల్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్

ధర:
Nothing Ear (Open) వైట్ కలర్‌లో ఫ్లిప్ కార్ట్ లో రూ. 9,999 ధరకు అందుబాటులో ఉంది. ఇది బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా లభిస్తుంది.

Exit mobile version