Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
- ఉద్యోగాల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ సంచలనం..
- భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని హింట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగిందే వాదన ఉంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వరసగా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన ఒక ఇంటర్నల్ ఈమెయిల్ సంచలనంగా మారింది. దీంతో ఉద్యోగుల్లో భయాలు మరింగా పెరిగాయి.
కేవలం ఏఐ వల్లే ఉద్యోగాలు పోయాయనే వదంతుల నేపథ్యంలో అమీ కోల్మన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఈ రోజు తొలగించబడిన ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయడం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’’ అని ఆమె తన ఈమెయిల్లో పేర్కొన్నారు. ‘‘మనం పనిచేసే విధానాన్ని ఏఐ మారుస్తోందని కూడా అంతే నిజం. మనం రోజూ చేసే అనేక పనులను ఇప్పుడు ఆటోమేట్ చేయవచ్చు. దీని అర్థం మనమందరం నిరంతరం నేర్చుకోవాలి. కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మారుతున్న పనికి అనుగుణంగా మారాలి’’ అని ఉద్యోగులకు స్పష్టం చేశారు.
Also Read
- 9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
- రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
4800 మంది ఉద్యగులను తొలగించడం ఒక్కసారి చేసే సర్దుబాటు కాదని అమీ కోల్మన్ స్పష్టం చేశారు. మనం ఈ ప్రయాణం ఆరంభంలోనే ఉన్నామని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని మార్పులను చూస్తామని, రాబోయే నెలల్లో కంపెనీలోని ఇతర విభాగాలు కూడా ఇలాంటి తీవ్రమైన సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ఈమెయిల్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సుమారుగా 9100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల 4800 మందికి ఉద్వాసన పలికింది.
తాజావార్తలు
-
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
-
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట’సింహం’
ట్రెండింగ్
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!