Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ‘RC17’ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. RC17 ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే.. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు, రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం లేదనే ప్రచారం నడవగా.. తాజాగా అనిరుద్ లాక్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోవాలని సుక్కు మొదటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కియారా అద్వానీ, సారా అర్జున్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా పేరు వినిపిస్తోంది.
బాలీవుడ్లో సైయారా సినిమాతో అనీత్ పడ్డా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు ‘సలామ్ వెంకీ’ సినిమాలో కనిపించినప్పటికీ.. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం సైయారా చిత్రమే. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.550 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విజయంతో ఈ బ్యూటీకి బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ‘శక్తి శాలిని’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘హూంకార్’ వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ యువ హీరోయిన్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో బాగానే వినిపిస్తోంది.
Also Read
- Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
- Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
- Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
RC17 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇటీవల నిర్మాత మైత్రి రవి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినిమా హీరోయిన్ ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో అనీత్ పడ్డా హైదరాబాద్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. ఆమె RC17 సినిమా కోసమే నగరానికి వచ్చిందని అభిమానులు అంటున్నారు. దీంతో రామ్ చరణ్‌కు జోడీగా అనీత్ నటించబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో కియారా, సారా పేర్లు వినిపించగా.. ఇప్పుడు అనీత్ పేరు తెరపైకి వచ్చింది. మరి సుకుమార్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!