Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓ జైలు గదిలో ఉంచినట్లుగా టెహ్రాన్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఒక భారీ హోర్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇరాన్ పెళ్లి వేడుకపై జరిగిన ఘోర దాడిని నిరసిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఈ వినూత్న నిరసనకు దిగింది. టెహ్రాన్‌లోని రద్దీ ప్రాంతమైన తాజ్రిష్ స్క్వేర్‌లో ఈ భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ట్రంప్ మాస్క్, విగ్ ధరించిన ఓ వ్యక్తిని నిజమైన జైలు సెల్‌ను తలపించేలా ఉన్న బోనులో నిలబెట్టారు. ఆ సెల్లో బెడ్, టాయిలెట్, సింక్ వంటి వసతులు కూడా కల్పించారు. అందులో ఉన్న నటుడు కటకటాలు పట్టుకోవడం, కునుకు తీయడం లాంటి విన్యోదకరమైన హావభావాలు ప్రదర్శిస్తుండటంతో స్థానికులు గుమిగూడి తమ ఫోన్లలో దీన్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ బోను వెనుక ఉన్న ఎలక్ట్రానిక్ స్క్రీన్‌పై గత నెల ఇరాన్‌లోని కుహెస్తాక్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శిస్తున్నారు.
ఇక, ఇరాన్ రాజధాని మున్సిపాలిటీకి చెందిన టెహ్రాన్ బ్యూటిఫికేషన్ ఆర్గనైజేషన్ ఈ వినూత్న ప్రదర్శనను మంగళవారం ప్రారంభించింది. పెళ్లి దాడి ఘటనపై చేపట్టిన 15 రోజుల ప్రచారంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇలాంటి పబ్లిక్ హోర్డింగ్‌ల ద్వారా తన రాజకీయ నిరసనలను వ్యక్తం చేస్తోంది. గతంలోనూ ట్రంప్ శవపేటికలో పడుకున్నట్లుగా ఒక హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాక, సోషల్ మీడియాలోనూ ట్రంప్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ మీమ్స్, వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ వివాహ వేడుకపై జరిగిన దాడి అంశమే ప్రస్తుతం ఈ ప్రచారానికి ప్రధాన కేంద్రబిందువుగా మారింది. అయితే, పౌరులను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోమని, ఇరాన్ నివేదికల గురించి తమకు తెలుసని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
Also Read
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
- Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
Iran: More footage of the live actor playing a jailed Donald Trump in a mock prison cell in Tehran’s Tajrish Square – WANA https://t.co/55HCZ3M1jT
— Wladimir van Wilgenburg (@vvanwilgenburg) October 21, 2026
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!