LG 5K Monitor: టీవీని మించిన ‘మినీ’ విజువల్.. 5K మెరుపులతో LG మానిటర్ వస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LG 5K Monitor: LG గేమింగ్ మానిటర్ విభాగంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలో మొట్టమొదటి 5K మానిటర్ రాబోతుంది. ఈ కంపెనీ అల్ట్రాగేర్ ఈవో సిరీస్ కింద మూడు కొత్త 5K గేమింగ్ మానిటర్లను పరిచయం చేసింది. వీటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ 32-అంగుళాలు, 43-అంగుళాల టీవీ కంటే పెద్దదిగా ఉండే భారీ 52-అంగుళాల మానిటర్లు ఉన్నాయి. ఇంకా వాటి ధరలను LG వెల్లడించలేదు. జనవరిలో ప్రారంభమయ్యే CES 2026 ఈవెంట్‌లో వీటిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వీటి ప్రత్యేకతలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Fire Accident : హైదరాబాద్ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
Also Read
- Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్‌ఫోన్.. 2028లో మార్కెట్‌లోకి?
- WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్‌నేమ్.. పూర్తి వివరాలు
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
అల్ట్రాగేర్ GX9 39GX950B ప్రత్యేకతలు ఇవే..
LG UltraGear GX9 సిరీస్ 39-అంగుళాల మోడల్. కంపెనీ దీనిని Tandem WOLED ప్యానెల్‌తో తీసుకువస్తుంది. ఈ మానిటర్ 21:9 అల్ట్రా-వైడ్ యాస్పెక్ట్ రేషియో, 5120 x 2160 యొక్క 5K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు 165Hz రిఫ్రెష్ రేట్, WFHD మోడ్ మధ్య మారడానికి కూడా అనుమతిస్తుంది. ఈ మానిటర్ ప్రొఫెషనల్ గేమర్స్, హై-ఎండ్ కంటెంట్ యూజర్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ GM9..
LG యొక్క 27-అంగుళాల అల్ట్రాగేర్ GM9 ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్. సాధారణంగా యూజర్స్‌ను ఈ మినీ LED ప్యానెల్లు బ్లూమింగ్ లేదా హాలో ఎఫెక్ట్‌తో బాధపడుతుంటాయి. కానీ LG పరిచయం చేసిన ఈ మానిటర్లలో మెరుగైన బ్లూమ్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ మానిటర్ VESA DisplayHDR సర్టిఫికేషన్‌తో వస్తుంది. అలాగే ఇది 1250 nits లైటింగ్ కలిగి ఉంటుంది. డ్యూయల్ మోడ్ 165Hz, 330Hz మధ్య మారడానికి ఫర్మిషన్ ఇస్తుంది.
LG సంస్థ UltraGear G9 అనే పెద్ద 52-అంగుళాల గేమింగ్ మానిటర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని పరిమాణం పెద్ద స్మార్ట్ టీవీ కన్నా పెద్దదిగా ఉంటుందని, అలాగే ఇది 5K రిజల్యూషన్‌కు కూడా మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ నివేదికల ప్రకారం.. ఈ మానిటర్ ప్రామాణిక అల్ట్రా HD మానిటర్ కంటే దాదాపు 33 శాతం వెడల్పుగా ఉంటుంది. ఇది స్థిరమైన 240Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది, గేమింగ్, మల్టీ టాస్కింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ఈ బహుళ మానిటర్ల అవసరాన్ని తొలగిస్తుందని LG చెబుతోంది.
ఈ మూడు కొత్త గేమింగ్ మానిటర్ల ధరలను LG ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. CES 2026లో ధర, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే సమాచారాన్ని కంపెనీ చెబుతుందని టెక్ ప్రపంచం అభిప్రాయపడుతుంది. UltraGear evo సిరీస్‌లో భాగమైన ఈ మానిటర్లు ప్రీమియం గేమింగ్ సెక్షన్‌ను టార్గెట్‌గా మార్కెట్‌లోకి రాయల్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.
READ ALSO: TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..
తాజావార్తలు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్‌లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!